Add Zee Business As A Preferred Source
App

Richest Actresses: టాప్‌ 5 హీరోయిన్లు ఎవరు? నాగచైతన్య మాజీ భార్య సమంత ఎక్కడో తెలుసా?

Written ByVishnupriya
Published: Oct 10, 2025, 09:14 PM IST|Updated: Oct 10, 2025, 09:14 PM IST

Top 5 Telugu Richest Actresses: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలతో పాటు హీరోయిన్‌లకూ మంచి పేరు.. డబ్బు..గుర్తింపు వస్తుంది. చాలా మంది హీరోయిన్స్ తమ కష్టంతో.. ప్రతిభతో టాప్‌ స్థాయికి చేరి కోట్లలో సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో.. తెలుగు స్టార్ హీరోయిన్స్‌లో అత్యంత ధనవంతులైన ఐదుగురు ఎవరంటే..

Samantha Ruth Prabhu Networth 1/5

సమంత రూత్ ప్రభు

సమంత టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తం.. లో టాప్ హీరోయిన్. సినిమాలతో పాటు ఆమెకు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌ ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. ఆమె అంచనా నికర సంపద ₹90 కోట్లకు పైగా ఉందని సమాచారం. శాకుంతలం, యశోద, ది ఫ్యామిలీ మాన్ 2 వంటి ప్రాజెక్టులతో ఆమె పాప్యులారిటీ మరింత పెరిగింది.

Nayanthara Networth 2/5

నయనతార

లేడీ సూపర్ స్టార్గా పేరొందిన నయనతార దక్షిణ భారతంలోనే అత్యధిక పారితోషికం.. తీసుకునే హీరోయిన్. ఆమె నికర సంపద ₹200 కోట్లకు పైగా ఉందని చెబుతారు. సినిమాలతో పాటు బ్యూటీ బ్రాండ్‌లు.. ప్రొడక్షన్ కంపెనీ ద్వారా కూడా ఆదాయం పొందుతోంది.

Rashmika Mandanna Networth3/5

రష్మిక మందన్నా

నేషనల్ క్రష్గా పిలువబడే రష్మిక.. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌ రెండింటిలో బిజీగా ఉంది. గీతా గోవిందం, పుష్ప వంటి సినిమాలతో సూపర్ హిట్ ఇచ్చిన.. రష్మిక నికర సంపద ₹50 కోట్లకు పైగా ఉందని సమాచారం.  

Pooja Hegde Networth4/5

పూజా హెగ్డే

పూజా హెగ్డే తెలుగులో అల వైకుంఠపురములో, మహర్షి, రాధే శ్యామ్ వంటి పెద్ద సినిమాల్లో.. నటించింది. ఆమె ఒక్క సినిమాకు ₹4-5 కోట్లు తీసుకుంటుంది. పూజా హెగ్డే నికర సంపద సుమారు ₹60 కోట్ల వరకు ఉంది.

Thammanaha Networth5/5

తమన్నా భాటియా

తమన్నా తెలుగు, తమిళ సినిమాల్లో సమానంగా పాప్యులర్. బాహుబలి, సైరా నరసింహా రెడ్డి వంటి బిగ్ ప్రాజెక్టుల్లో నటించిన ఆమెకి బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్.. ద్వారా కూడా మంచి ఆదాయం ఉంది. ఆమె నికర సంపద సుమారు ₹80 కోట్ల వరకు ఉందని తెలుస్తుంది.