Add Zee Business As A Preferred Source
App

Richest Comedian: అత్యంత ధనవంత కమెడియన్లు ఎవరో తెలుసా? బ్రహ్మానందం ఆస్తులెన్ని?

Published: Oct 11, 2025, 04:19 PM IST|Updated: Oct 11, 2025, 04:19 PM IST

Brahmanandam Net Worth Shocking Details: భారతదేశంలో ఎంతో మంది తమ నటన, చేష్టలతో ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్విస్తారు. ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను కట్టి పడేస్తున్న హాస్య నటులు ఆస్తులు తెలుసా? దేశంలో ఉన్న కమెడియన్‌లలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసుకుందాం. వారిలో మన బ్రహ్మానందం ఎన్నో స్థానంలో ఉన్నాడో చూద్దాం.

1/6

భారతీయ సినీ పరిశ్రమ ఎంతో మందికి స్టార్‌డమ్‌ ఇచ్చింది. హీరో హీరోయిన్లతోపాటు హాస్య నటులు కూడా ఉన్నారు. దేశంలో అత్యంత ధనవంతులైన హాస్యనటులు కూడా ఉన్నారు. భారతదేశంలో అత్యంత ధనవంతులైన హాస్యనటుల గురించి తెలుసుకుందాం.

2/6

భారతీయ సినిమాలో జానీ లివర్, రాజ్‌పాల్ యాదవ్, వడివేలు, గౌండమణితోపాటు మన బ్రహ్మానందం ప్రముఖ హాస్యనటులుగా కొనసాగుతున్నారు. ఆస్తులపరంగా చూస్తే మన బ్రహ్మానందమే మొదటి స్థానంలో ఉన్నారు. దక్షిణాది కాదు భారతీయ సినీ పరిశ్రమలోనే ధనవంతుడైన హాస్యనటుడిగా బ్రహ్మానందం గుర్తింపు పొందారు.

3/6

తెరపై బ్రహ్మానందం కనిపించగానే నవ్వు వచ్చేస్తుంది. తెలుగులోనే కాకుండా అనేక దక్షిణ భారత చిత్రాలలో బ్రహ్మీ నటించారు. దాదాపు 45 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న బ్రహ్మానందం ఆస్తుల్లో కూడా అందనంత స్థాయిలో ఉన్నారు.

4/6

ఇప్పటివరకు దాదాపు 1200కు పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం భారీగా సంపాదించారు. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన సంపాదనే కాకుండా వ్యాపారం, వాణిజ్య ప్రకటనలు చేయడం వంటి వాటితో బ్రహ్మా ఆస్తులు భారీగా ఉన్నాయి. బ్రహ్మానందం ఆస్తుల విలువ రూ.500 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అత్యధిక పారితోషికం పొందే హాస్యనటుడు బ్రహ్మీ.

5/6

నటనలోనూ.. ఆస్తుల్లోనూ బ్రహ్మానందం సరిసాటి హాస్య నటుడు ఎవరూ లేరు. హిందీ నుంచి కపిల్ శర్మ ఆస్తుల పరంగా రెండో స్థానంలో నిలిచాడు. అతడికి రూ.300 కోట్ల ఆస్తులు ఉంటాయి. మరో హాస్య నటుడు జానీ లివర్ రూ.280 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నాడు.

6/6

తమిళ స్టార్‌ కమెడియన్‌ వడివేలు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల మధ్య ఆస్తులు కలిగి ఉండగా.. తర్వాత సంతానం, యోగి బాబు, గౌండమణి అత్యధిక ఆస్తులు ఉన్నవారిగా గుర్తింపు పొందారు.