Samantha: నాగ చైతన్యకు ముందు సమంత ఎవరినీ ప్రేమించిందో తెలుసా? డేటింగ్ కూడా?

Know Who Samantha Loved Before Naga Chaitanya: సినీ పరిశ్రమలో సమంత వ్యక్తిగత జీవితంపై అందరి దృష్టి ఉంది. విడాకుల తర్వాత మరొకరితో ప్రేమలో సమంత ఉందని తెలిసీనప్పటి నుంచి ఆమె జీవితంపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. తాజాగా చైతూ కన్నా ముందు సమంత ఎవరితో ప్రేమలో ఉన్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది.

1 /6

సినీ నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా.. మోడల్‌గా.. స్వచ్ఛంద సేవ చేస్తున్న వ్యక్తిగా ఇలా పలు బాధ్యతలు నిర్వహిస్తూ సమంత చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితంపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఒకరితో ప్రేమలో ఉండడమే కాకుండా డేటింగ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో ఒకరితో సమంత ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఎవరో తెలుసుకుందాం.

2 /6

'ఏమాయ చేసావే' సినిమాతో సినీ పరిశ్రమలోకి సమంత అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హీరోయిన్‌ కాకముందు సమంత మోడలింగ్ చేసేది. నాగచైతన్యతో నటించిన అనంతరం మహేశ్‌బాబుతో దూకుడు, పవన్‌ కల్యాణ్‌తో అత్తారింటికి దారేది, రామ్‌చరణ్‌తో రంగస్థలం, అనంతరం మహానటి సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 

3 /6

సినిమా జీవితం గొప్పగా ఉంటే.. సమంత వ్యక్తిగత జీవితం మాత్రం చాలా ఒడిదుడుకులతో కూడుకుని ఉంది. ప్రస్తుతం చర్చ జరుగుతున్న రాజ్‌ నిడిమోరు, విడాకులు పొందిన నాగచైతన్య కన్నా ముందు సమంత ఒకరితో ప్రేమలో పడ్డారని.. వారిద్దరూ డేటింగ్‌ కూడా చేశారని పుకార్లు ఉన్నాయి.

4 /6

హీరో సిద్ధార్థ్‌తో సమంత తొలిగా ప్రేమలో పడ్డారని పుకార్లు ఉన్నాయి. 'జబర్దస్త్' సినిమాలో సిద్ధార్థ్‌, సమంత చేశారు. ఆ సినిమా సెట్స్‌లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ప్రచారం జరుగుతోంది. 2013 నుంచి 2015 వరకు వారి సంబంధం బలంగా ఉందనే రూమర్లు వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారంట. కానీ ఏమైందో కానీ సిద్ధూ, సమంత వివాహం చేసుకోలేదు.

5 /6

తన తొలి సినిమా హీరో అక్కినేని నాగచైతన్యతోనే సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2017లో గోవాలో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ నాలుగు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకుని విడిపోయారు. చైతూ రెండో వివాహం చేసుకోగా.. సమంత ఒంటరిగా ఉంది.

6 /6

ముచ్చటగా సమంత జీవితంలో మూడో జీవితం ఉందని తెలుస్తోంది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమలో ఉందని.. ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. రాజ్‌ నిడిమోరు దర్శకత్వంలో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్', 'సిటాడెల్' వెబ్‌ సిరీస్‌లో సమంత నటించడంతో.. ఆ సమయంలో వీరిద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగి ప్రస్తుతం డేటింగ్‌ వరకు వచ్చిందని చర్చ జరుగుతోంది. త్వరలో పెళ్లి చేసుకుంటారని పుకార్లు వస్తున్నాయి.