Krishna Janmashtami 2021: దేశవ్యాప్తంగా వైభవంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు...ఫోటోస్ వైరల్!
దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ..శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు భక్తులు జరుపుకుంటున్నారు.
నోయిడాలోని ఇస్కాన్, మధుర, బృందావన్ దేవాలయాలతో సహా ప్రముఖ ఆలయాల్లో శంఖాలు ఊది..డప్పులు కొట్టి..శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రారంభించారు.
నోయిడాలోని ఇస్కాన్, మధుర & బృందావన్ దేవాలయాలలో కృష్ణాష్టమి సంబరాలు ప్రారంభమయ్యాయి.
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నోయిడాలోని ఇస్కాన్ ఆలయంలో వందలాది మంది భక్తులు ఉదయం ప్రార్థనలు చేశారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తులు ఉపవాసం ఉంటూ..భక్తి గీతాలు అలపించారు. పురుషులు, మహిళలు మరియు పిల్లలు క్యూలలో నిలబడి ప్రార్థనలు చేస్తున్నారు.
శ్రీకృష్ణుడిని ఆశీర్వదించడానికి ప్రజలు దేవాలయాలను సందర్శిస్తారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు శ్రీకృష్ణుడి జీవితం ఆధారంగా నాటకాలు మరియు నృత్య కార్యక్రమాలను నిర్వహిస్తారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని భక్తులు ఉపవాసం ఉంటూ..భక్తి గీతాలు అలపించారు. పురుషులు, మహిళలు మరియు పిల్లలు క్యూలలో నిలబడి ప్రార్థనలు చేస్తున్నారు.
శ్రీ కష్ణుడు జన్మాష్టమి సందర్భంగా సూరత్ ఇస్కాన్ దేవాలయం పూర్తిగా అలంకరించబడింది. ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా తరలివచ్చే అవకాశం ఉండటంతో...స్వచ్ఛందసేవకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.