Kuja Deva Effects On Zodiac: కుజుడు ఏప్రిల్ నెలలోనే గ్రహ సంచారంతో పాటు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. చాలా అరుదుగా ఇలా ఒకే నెలలో రెండు సంచారాలు చేస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారిపై సానుకూలమైన ఎఫెక్ట్ పడుతుంది. దీంతో కొన్ని రాశుల్లో జన్మించిన వారు అదృష్టాన్ని పొందుతారు.
Kuja Deva Effects On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలకు అధిపతి కుజుడుగా భావిస్తారు ఈ గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది అంతేకాకుండా అప్పుడప్పుడు ఈ గ్రహం నక్షత్ర సంచారం, తిరోగమనం చేయడమే కాకుండా కదలికలు కూడా జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం పరంగా ఈ గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని డబ్బు, ఆనందంతో పాటు శ్రేయస్సు, సంపాదనకు సూచికగా భావిస్తారు. అయితే కుజుడు ఏప్రిల్ మూడో తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 6 గంటలకు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.
కుజుడు ఒకే నెలలో గ్రహ సంచారంతో పాటు నక్షత్ర సంచారం చేయడం వల్ల ఎంతో ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతుంది. ముఖ్యంగా అంగారకుడు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. కాబట్టి కొన్ని రాశుల్లో జన్మించిన వ్యక్తులకి ఉద్యోగాలు, వ్యాపారాలపరంగా కలిసి వస్తుంది. జీవితంలో ఆనందం కూడా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కుజుడు ఒకే నెలలో రాశి సంచారంతో పాటు నక్షత్ర సంచారం చేయడం వల్ల వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు అపారమైన విజయాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని రంగాల్లో పనిచేసే వారికి ఆర్థికపరమైన మార్పులు వచ్చి ఊహించని లాభాలు కలుగుతాయి. కెరీర్ పరంగా కూడా బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారు భారీ మొత్తంలో లాభాలు అర్జించే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి..
కుజుడు అనుగ్రహం తులా రాశి వారికి కూడా ఉంటుంది ఈ రాశి వారు ఏప్రిల్ నెల నుంచి విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా వీరు ప్రయాణాలు చేయడం వల్ల అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. కెరీర్లో కొత్త కొత్త అవకాశాలు పొందుతారు. అలాగే కెరీర్ పరంగా కొన్ని విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. వీరి వ్యూహాలు వ్యాపారాల పరంగా ఎంతో బాగుంటుంది. ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి పురోగతిని సంపాదించుకుంటారు. అలాగే పూర్వీకుల ఆస్తుల నుంచి కూడా భారీ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు..
కర్కాటక రాశి వారికి కూడా కుజుడు ఎఫెక్ట్ వల్ల కొన్ని అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే వ్యాపారాలపరంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.. ఉద్యోగాలు చేస్తున్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కెరీర్ పరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా కుజుడి అనుగ్రహం వల్ల పరిష్కారం అవుతాయి. అలాగే అసంపూర్ణంగా ఉన్న పనులు కూడా పూర్తవుతాయి ఉద్యోగాలు చేసే వారికి కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.
కుజుడి సంచార ప్రభావం వల్ల కర్కాటక రాశిలో జన్మించిన వారికి స్టాక్ మార్కెట్ పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న వారికి ఈ సమయం డబ్బులు సంపాదించుకునేందుకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. అలాగే వీరికి కొత్త ఆదాయ వనరులు లభించి భారీ మొత్తంలో లాభాలను అర్జించే అదృష్టాన్ని పొందుతారు. ప్రేమ జీవితంలో మాధుర్యం కూడా విపరీతంగా పెరుగుతుంది.