Add Zee Business As A Preferred Source
App

Kuja Gochar: కుజ సంచారంతో ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు కాబోతున్నారు.. మీ రాశి ఉందా..

Written ByTA Kiran Kumar
Published: Sep 12, 2025, 05:16 AM IST|Updated: Sep 12, 2025, 05:20 AM IST

Kuja Gochar: గ్రహ మండలంలో నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికి శుభాలు జరిగితే.. మరికొన్ని రాశుల అంత అనుకూలంగా ఉండవు. అలా కుజుడు త్వరలో కన్య రాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికి అనుకోని ధనయోగం కలగబోతుంది.  అంతేకాదు కొన్ని రాశుల వారు కోటీశ్వరులు కావడం పక్కా అని చెబుతున్నారు. 

Kuja Gochar1/6

కుజ గోచారం

Kuja Gochar: కుజుడు తులా సంచారంతో కొన్ని రాశుల వారికి భూమి, ఇల్లు, పదోన్నతి సహా విదేశాల్లో ఉద్యోగ  అవకాశాలు దొరకబోతున్నట్టు గ్రహ స్థితులు చెబుతున్నాయి. అంతేకాదు వీరి ఆర్థిక సమస్యలు పరిష్కార మయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జ్యోతిష్యంలో, కుజుడి నవగ్రహాల సైన్యాధ్యక్షుడు. ఈయన పోరాటం, శక్తి, అధికారం,  బలం, ధైర్యానికి ప్రతీక భావిస్తుంటారు. 

Kujudu Balam 2/6

కుజుడు బలం

ఒక వ్యక్తి జీవితంలో కుజుడి శక్తి బలంగా ఉంటే, అతనికి భూమి, ఇల్లు, స్థానం, వాహనం, డబ్బుతో పాటు అధికారం,  శక్తి వంటి పలు ప్రయోజనాలు దక్కుతాయి. కుజుడు తులా రాశిలో ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికి అనుకోని ప్రయోజనాలు సిద్ధించబోతున్నాయి. 

Dhanassu Rasi 3/6

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి: కుజ సంచారము ధనుస్సు రాశి వారికి సంపద అమాంతం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  విద్య,  ఉద్యోగ రంగాలలో అడ్డంకులు తొలగిపోతాయి. ఉమ్మడి వ్యాపారాలలో భారీ లాభాలు ఉండబోతున్నాయి. ఫలితంగా ఊహించని ఆదాయం పెరుగుతుంది. భూమి, బంగారం, వెండి మరియు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. 

 

Mesha Rasi 4/6

మేష రాశి

మేష రాశి: కుజుడు  ఈ రాశి అధిపతి కాబట్టి, ప్రస్తుత కదలిక మేషరాశికి మంచి ప్రయోజనాలను అందించబోతుంది. మీరు చాలా కాలంగా కలలు కంటున్న భూమిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతేకాదు కొత్త ఇల్లు లేదా వాహనం కొనే అవకాశం త్వరలో సిద్ధించబోతుంది.   మీరు చేసే పనిలో పదోన్నతి లేదా జీతం పెరుగుదల ఉండబోతుంది. 

Leo 5/6

సింహ రాశి

సింహ రాశి: రవికి సంబంధించిన  కుజుడి శక్తి సింహరాశికి మంచి మద్దతును అందిస్తుంది. త్వరలో వీరు భూమి,  ఆస్తికి సంబంధించిన సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. కోర్టు పనుల్లో విజయం సాధిస్తారు. చట్టపరమైన విషయాలలో విజయం సాధిస్తారు.  

 

Disclaimer6/6

గమనిక

Disclaimer: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగం, నమ్మకాలు లేదా సనాతన మత గ్రంథాలు వంటి వివిధ మాధ్యమాల నుండి సేకరించి ఇవ్వబడింది. జీ  న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు.