L2Empuraan: ఎంపురాన్ మూవీ కోసం మోహన్ లాల్, నేను ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదు.. పృథ్వీరాజ్ సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..

L2Empuraan: మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లూసీఫర్’ . ఇపుడీ మూవీకి ప్రీక్వెల్ గా ‘ఎంపురాన్’ మూవీ రాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో మోహన్ లాల్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

1 /6

L2Empuraan:పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన దిల్ రాజు కి ధన్యవాదలు.  తెలుగులో మా సినిమాను విడుదల చేస్తున్న ఆయనకు కృతజ్ఞతలు. ఇలాంటి సినిమాను మేం ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒరిజినల్ వర్షెన్‌లానే తెలుగు వర్షెన్ ఉంటుందన్నారు.

2 /6

తెలుగు డబ్బింగ్ కోసం చాలా కష్టపడ్డామన్నారు.  చాలా నాచురల్ గా ఉండాలని ప్రయత్నించామన్నారు. తెలుగు ప్రేక్షకులు తెలుగు వర్షెన్‌లో చూస్తే.. ఒరిజినల్ సినిమానే అనుకుంటారు.ఎక్కడా డబ్బింగ్ సినిమా అన్నట్టుగా కనిపించదు.

3 /6

లూసిఫర్ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేయలేదు. కానీ అన్ని భాషల్లోకి ఆ చిత్రం ప్రేక్షకులకు చేరువైంది. అందుకే ఇప్పుడు ఈ రెండో పార్ట్‌ను ప్రపంచ వ్యాప్తంగా అన్నిప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నామన్నారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే అన్నీ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి.  ఈ రేంజ్ ట్రెండ్ చూసి మేమంతా ఆశ్యర్యానికి గురువతున్నాము.

4 /6

నా దృష్టిలో మంచి సినిమా చెడ్డ సినిమా అనేది మాత్రమే ఉంటుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదన్నారు. నేను మంచి సినిమాను తీశానని నమ్ముతున్నాను. కాకపోతే ఆ సినిమాను హై బడ్జెట్‌లో తెరకెక్కించాను. ఈ చిత్రాన్ని చూసిన తరువాత ఏ ఒక్కరూ కూడా ఎంత బడ్జెట్ అయి ఉంటందో అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరన్నారు.

5 /6

అలా ఎంత అంచనా వేసినా సరే దానికంటే ఎక్కువగానే ఉంటుందన్నారు. మోహన్‌లాల్  ఇచ్చిన సపోర్ట్, ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్ వల్లే ఈ చిత్రాన్ని ఇంత గ్రాండియర్‌గా, ఇంత హై బడ్జెట్‌‌లో తీయగలిగామన్నారు. ఈ క్రెడిట్ అంతా ఆయనదే అన్నారు.

6 /6

ఎంపురాన్  మూవీ కోసం మోహన్‌లాల్ గారు, నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేశాం. మార్చి 27న మా చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.  అందరూ చూసి ఎంజాయ్ చేస్తారన్నారు. మూడో పార్ట్ చేసేలా సపోర్ట్ చేయండన్నారు.