Lady Superstar Of Malayalam: మంజు వారియర్.. ఈ మలయాళ లేడీ సూపర్ స్టార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 47 ఏళ్ల వయసులోనూ తన అందంతో స్టార్ హీరోయిన్లకు పోటీగా నటిస్తోంది ఈ బ్యూటీ. అయితే ఈ ఏజ్‌లోనూ వరుస సినిమాలు, యాడ్స్‌తో దూసుకెళ్తున్న మంజు వారియర్ ఆస్తులు ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.
1/5మంజు వారియర్ మలయాళ సినిమాల్లో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు పొందిన నటి. చిన్న వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టి భారతీయ సినిమా పరిశ్రమలో ప్రముఖ నటిగా ఎదిగింది. 47 ఏళ్ల వయసులోనూ స్టార్ హీరోయిన్లకు కాంపిటిషన్‌గా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది ఈ అమ్మడు.
2/5మంజు వారియర్ నికర విలువ సుమారు 142 కోట్ల రూపాయలు అని సమాచారం. సినిమాలతో పాటు బ్రాండ్‌లతో ఒప్పందాలు, సోషల్ మీడియా ద్వారా ఆమె భారీగా సంపాదిస్తుంది. ఒక్కో సినిమాకు 50 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు మంజు వారియర్ తీసుకుంటుందని వినికిడి. మలయాళంతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటించి అందరినీ ఆకట్టుకుంది ఈ బ్యూటీ.
3/5అసురన్, తునివు వంటి సినిమాల్లో మంజు వారియర్ చేసిన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి. దీంతో ఆడియన్స్ అందరికీ ఫేవరేట్‌గా మారిపోయింది. అయితే మంజు వారియర్ బైక్‌లంటే చాలా ఇష్టపడుతుంది. ఆమె వద్ద పలు ఖరీదైన బైక్‌లు ఉన్నాయి. ఇటీవల ఆమె 21 లక్షల రూపాయల విలువైన BMW బైక్ కొని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
4/5విభిన్న పాత్రలను సహజంగా పోషించే మంజు వారియర్ నటనా నైపుణ్యం.. మలయాళం ఇండస్ట్రీలో ఆమెను సూపర్‌స్టార్‌గా నిలబెట్టింది. ఇక మంజు వారియర్‌కు సోషల్ మీడియాలో 4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ప్రజాదరణ వల్ల బ్రాండ్ ఒప్పందాల నుండి ఆమె ఒక్కో ఒప్పందానికి 75 లక్షల రూపాయల వరకు సంపాదిస్తుందని తెలుస్తోంది.
5/5ఇప్పటికీ మంజు వారియర్ అనేక కొత్త సినిమాలు, ప్రకటనలతో దూసుకెళ్తోంది. ఆమె కృషి, బహుముఖ ప్రతిభతో భారతీయ సినిమాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.