Lakshmi Devi Favorite Zodiac Signs: సమస్త సృష్టికి మూలాధారమైన అమ్మవారిని లక్ష్మీదేవిగా.. సరస్వతిగా.. పార్వతి మాతగా కొలుస్తారు సనాతన హిందూ సంప్రదాయ వాదులు. ఇక అమ్మవారి దృష్టిలో అందరు సమానమే. అలా పన్నెండు రాశులు వారి కర్మానుసారము వారికి ధనధాన్య యోగాలను అందిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా కొన్ని రాశుల వారిపై లక్ష్మీ దేవి అమ్మవారి కృపా కటాక్షలు ఉంటాయనేది కొన్ని ధర్మ శాస్త్ర గ్రంథాలు ఘోషిస్తున్నాయి.
1/6తులారాశి : అధిపతి శుక్రుడు. లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం ఈ రాశిపై ఎల్లప్పుడూ ఉంటుంది. జీవితంలో కష్టసుఖాలను రెండు త్రాసుల్లో సమతూకంతో చూస్తారు. వీరు కష్టనష్టాలను ఎదర్కొన్నతర్వాత అంతిమంగా లక్ష్మీ దేవి కటాక్షం పొందుతారు. అదృష్టం యొక్క మద్దతు లభిస్తుంది. వారు జీవితంలో ప్రతి ఆనందాన్ని పొందుతారు.
2/6వృశ్చిక రాశి: వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు ఎక్కువ కష్టపడి పనిచేస్తుంటారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం కారణంగా, వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. చేసే పనుల్లో త్వరగా విజయం సాధిస్తారు.
3/6కర్కాటక రాశి: కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు కూడా ఉంటాయి. చంద్రుడు లక్ష్మీ దేవి సహోదరుడు. అందువల్ల, వారు ఎటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. వారు ఎప్పటికీ డబ్బు కొరతను ఎదుర్కోరు.
4/6వృషభరాశి : లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులలో వృషభ రాశి ఒకటిగా పరిగణించబడుతుంది. వీళ్లలో కష్టపడి పనిచేసేవారు.. నమ్మదగినవారు. వారు తమ జీవితాల్లో విజయం సాధిస్తారు. వీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా ఉంటారు. వీరు జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోరట.
5/6సింహరాశి : సింహ రాశికి అధిపతి సూర్యుడు. సంపదకు దేవత లక్ష్మీదేవి కూడా ఈ రాశి ప్రజల పట్ల దయతో వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు తమ కోపాన్ని నియంత్రించుకోవాలి. అపుడే కానీ జీవితంలో పై స్థాయికి ఎదగలేరు. అంతేకాదు ఆర్థిక రంగంలో ఎటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.కానీ అప్రమత్తత అవసరం.
6/6గమనిక: ఈ వ్యాసం మతపరమైన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. ఆయా రాశుల వారికి వారు చేసుకున్న పూర్వ క్రమానుసారం వారు చేసే పూజాదికాలు వారి అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. జీ న్యూస్ దీనిని ఈ వార్తను సమర్థించడం లేదు.