Add Zee Business As A Preferred Source
App

Khairtabad: ఖైరతాబాద్‌ వినాయకుడి దర్శనం నేడే లాస్ట్‌.. ఆ సమయం వరకే ఛాన్స్‌..!

Written ByRenuka Godugu
Published: Sep 04, 2025, 08:55 AM IST|Updated: Sep 04, 2025, 08:55 AM IST

Last Day For Khairtabad Ganesh Darshan: హైదరాబాద్‌లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఖైరతాబాద్‌ వినాయకుడి దర్శనం నేడే లాస్ట్ డేట్‌. గురువారం అర్ధరాత్రి వరకే అనుమతి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత భక్తుల దర్శనాలను నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.. 
 

Khairtabad Ganesh1/5

ఖైరతాబాద్ గణేష్

ఖైరతాబాద్ గణేష్ ని చూడటానికి మీరు కూడా వెళ్తున్నారా? అయితే గురువారం అర్ధరాత్రి వరకు అనుమతి ఉంటుందని ఖైరతాబాద్ వినాయకుడి అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నారు.   

Vinayaka Nimajjanam2/5

వినాయకుడి నిమజ్జనం

ప్రధానంగా శనివారం మహా వినాయకుడి నిమజ్జనం సందర్భంగా షెడ్డు తొలగింపు పనులు, క్రేన్‌ ఏర్పాట్ల కారణంగా శీఘ్ర, సర్వదర్శనాలకు అవకాశం ఉండదు. భక్తులు విషయాన్ని గమనించాలని అసోసియేషన్‌ వారు కోరారు.  

Khairtabad3/5

ఖైరతాబాద్

ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్లడానికి భక్తులు అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతించనున్నారు. ఇక ఎల్లుండి ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఖైరతాబాద్ గణేష్ ని 30 లక్షల మంది దర్శించుకున్నారు.  

Tankbund4/5

ట్యాంక్‌ బండ్‌

మరోవైపు తొమ్మిదో రోజు నిమజ్జనం సందర్భంగా అర్ధరాత్రి నుంచే ట్యాంక్‌ బండ్‌ వైపుగా వస్తున్న వాహనాలతో తీవ్ర ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. గంగమ్మ ఒడికి భారీగా గణనాథులు తరలించారు. ఈ క్రమంలో ట్యాంక్ బండ్‌ వైపు వందలాది భారీ వాహనాలు, వేలాది బైకులు ఉదయం నుంచే పోటెత్తాయి.  

Traffic Jam5/5

ట్రాఫిక్ జామ్

ఇక అర్ధరాత్రి వరకు సాధారణ ప్రజలు నిమజ్జన ఘట్టాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. ఇటు ఇందిరాపార్కు అటు లక్డీకాపూల్ రూట్ రాణిగంజ్ రూట్ లపై గణపయ్యలను తీసుకొచ్చే వాహనాలతో ఉదయాన్నే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఈ రూట్లు అవాయిడ్ చేస్తే బెటర్.