Add Zee Business As A Preferred Source
App

Muggulu 2026: కొత్త డిజైన్‌ న్యూ ఇయర్ 2026 ముగ్గులు.. ఇప్పుడే ఇలా వేయండి!

Published: Dec 31, 2025, 11:23 AM IST|Updated: Dec 31, 2025, 11:23 AM IST

Happy New Year Muggulu: మీ ఇంటి ముందు మంచి డిజైన్‌తో ముగ్గులు వేయాలనుకుంటున్నారా? ఇలా సులభంగా Happy New Year 2026 ముగ్గులను మేము అందించిన డిజైన్స్‌తో వేసుకోండి. ఈ డిజైన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Happy New Year Muggulu 2026: నూతన సంవత్సరం జీవితం కొత్త కొత్త ఆశలు, ఆశయాలతో ప్రారంభమవుతుంది. ఇలాంటి సమాయాన్ని చాలా మంది కలర్‌ఫుల్‌గా జరుపుకోవాలనుకుంటారు. అందుకే కొంతమంది తెలుగు వారు సాంప్రదాయ బద్దంగా జరుపుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే చాలా మంది  ఇంటి ముంగిట ముగ్గులు వేసుకుంటారు. అంతేకాకుండా పండగ సమయాల్లో వేసుకునే ముగ్గుల కంటే.. జనవరి 1వ తేదీన వేసే ముగ్గులకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి..
 

New Year Design Muggulu1/5

ముగ్గులు

జనవరి 1వ తేదీన ముగ్గులకు ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్‌లో వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమయంలో మహిళలు గంటల తరబడి సమయం తీసుకుని మరీ ముగ్గులో రంగులు నింపుతూ ఉంటారు. అలాగే అందరూ ఎంతో అందమైన ముగ్గులు వేస్తూ..  రాబోయే కాలానికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఉంటారు.  

New Year Simple Muggulu2/5

ముగ్గులు 2026

ఇంటి ముందు కొత్త సంవత్సరం రోజున ముగ్గులు వేసుకోవడం వల్ల సానుకూల శక్తిని (Positive Energy) ఆహ్వానించినవారవుతారని పూర్వీకులు చెబుతూ ఉంటారు. అందుకే గత కొన్ని సంవత్సరాల నుంచి భారతీయులు కొత్త సంవత్సరం రోజున ఉదయాన్నే మగ్గులు వేసుకుంటున్నారు..  

Newyear Muggulu3/5

డిజైన్‌

నూతన సంవత్సరం మహిళలు తెల్లవారుజామునే ఇళ్లను శుభ్రం చేసుకుని.. రంగురంగుల ముగ్గులతో ముంగిళ్లను అలంకరిస్తారు. ప్రస్తుతం చాలా మంది మహిళలు న్యూ ఇయర్ రోజు వేసే కొన్ని ముగ్గులు చాలా అందంగా ఉంటున్నాయి. మీరు కూడా ఇలాంటి ముగ్గులను వేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా సులభంగా మేము అందించిన డిజైన్‌తో వేయండి..

Rangoli Muggulu4/5

కలర్స్‌

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న డిజైన్‌ మీ ఇంటి ముందు సింపుల్‌గా వేసుకోవచ్చు. సమయం వృధా చేయకుండా అతి తక్కవ సమయంలో ఇంటి ముందు పరిచేయండి.. అలాగే ఇందులో కలర్స్‌ను కూడా చాలా సింపుల్‌గా నింపొచ్చు..  

Rangoli Muggulu5/5

Happy New Year 2026 ముగ్గులు

ఈ రోజు Happy New Year 2026 ముగ్గులు కూడా చాలా మంది వేసుకుంటారు.. రంగు రంగులను ఈ ముగ్గులో నింపుతూ అందంగా అలంకరించవచ్చు. కొత్త సంవత్సరం రోజు కొంతమంది తేదీలు, నెలలతో కూడిన డిజైన్లు వేస్తారు.