Laxmi Narayana chaturgrahi Rajayogam: జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మార్చి ప్రారంభంలో గ్రహాల యొక్క అరుదైన ప్రత్యేక యోగం ఏర్పడబోతుంది. రాహువు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు అనే నాలుగు గ్రహాలు మీన రాశిలో కలుగనున్నాయి.
Laxmi Narayana chaturgrahi Rajayogam: జ్యోతిషశాస్త్రం ప్రకారం, మార్చి ప్రారంభంలో అరుదైన ప్రత్యేక గ్రహ యోగం ఏర్పడబోతుంది. రాహువు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు నాలుగు గ్రహాలు మీన రాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. ముఖ్యంగా, బుధుడు, శుక్రుడి కలయిక లక్ష్మీ నారాయణ రాజయోగాన్ని సృష్టించనుంది. ఈ యోగం వలన ఐదు రాశుల వారికి కుటుంబ జీవితంలో పెద్ద మార్పు.. పని, ఆర్థిక పరిస్థితిపై గతంలో కంటే మెరుగ్గా ఉండబోతుంది.
కన్య రాశి.. ఈ రాశి వారికి ఈ గ్రహం యొక్క స్థానం 7వ ఇంట్లో ఉండటం మూలానా.. భార్య నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. గత కొన్ని రోజులగా అనుభవిస్తున్న కష్టాలు పటా పంచలు అవుతాయి. కోర్టు కేసుల్లో మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాములు మంచి లాభాలను అందుకుంటారు. కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
వృషభ రాశి: చతుర్గ్రాహి గ్రహం యొక్క స్థానం 11వ ఇంట్లో ఉంది. నాలుగు గ్రహాల కలయిక వలన స్నేహితులు, సహోదరుల నుండి ప్రయోజనాలను అందుకుంటారు. ఆదాయానికి ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి. వ్యాపారులకు, ఉద్యోగులకు మంచి ఉన్నత కాలం. మీరు కోరుకునే ప్రతిదీ నెరవేరే అవకాశం ఉంది. ఆకస్మిక ఆర్థిక లాభంతో మనస్సు ఆనందంగా ఉంటుంది.
కుంభ రాశి: కుంభ రాశి వారికీ చతుర్గ్రాహి యోగం 4వ ఇంట్లో ఉండటం మూలానా.. మీ తల్లి వైపు ఆస్తులు కలిసొస్తాయి. మంచి ప్రయోజనాలు అందుకుంటారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అపారమైన ఆనందం సంపదను పొందుతారు.
మిథున రాశి : ఈ యోగం 10వ స్థానంలో ఏర్పడటం వలన ఎన్నో ప్రయోజనాలు అందుకుంటారు. వివాహితులు వారి అత్తమామల నుండి ప్రయోజనాలను పొందవచ్చను. వివాహా జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారులకు మంచి ఛాన్సెస్ లభిస్తాయి. ఉద్యోగస్థులకు జీతం పెరుగుతుంది. ప్రమోసన్ లభిస్తోంది. అంతేకాదు త్వరలో శుభవార్త అందుకుంటారు.
కర్కాటక రాశి: చతుర్గ్రాహి గ్రహం కర్కాటక రాశి నుంచి 9వ ఇంట్లో జరగబోతుంది. అదృష్టం మీ వెంట ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆధ్యాత్మిక దృక్పథం వలన అన్ని లాభాలే కలుగుతాయి.విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ఇదే సువర్ణ అవకాశం ఉంది. విద్యార్థుల కలలన్నీ నిజమవుతాయి.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, మత గ్రంథాలు ఆధారంగా వంటి వివిధ వనరుల నుండి సేకరించబడింది. జీ న్యూస్ దీన్ని ధృవీకరించడం లేదు.