Home Made Tasty Rice : ప్రస్తుత తరం జీవనశైలి వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇవన్నీ కూడా ఆహారాలవాట్ల వల్ల కూడా అనడంలో సందేహం లేదు. ఎక్కువగా బయట ఫుడ్ తినడం వల్ల అలానే.. మన సాంప్రదాయ వంటకాలకు దూరంగా ఉండటం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది..
1/5మన పూర్వీకులు.. చేసుకొని తినే ఆహారంలో ఎన్నో పోషకాలు ఉండేవి. అందుకే ఇప్పుడు ఉన్నన్ని రోగాలు అప్పట్లో ఉండేవి కాదు. ఇక మన పూర్వీకులు.. కనిపెట్టిన వంటకాల్లో ఎంతో రుచికరమైన ఒక వంటకం నిమ్మకాయ అన్నం.
2/5నిమ్మకాయ అన్నం రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో రోగాలకు చెక్ కూడా పడుతుంది. నిమ్మరసం అనేది చాలా మంచిది. ఇక నిమ్మకాయ అన్నంలో మనం పసుపు కూడా వాడుతాం కాబట్టి అది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది.
3/5అందుకే వారంలో కనీసం ఒక్కరోజైనా నిమ్మకాయ అన్నం తినడం ద్వారా.. అజీర్ణం, ఒబిసిటీ, గుండె సంబంధిత వ్యాధులు లాంటివి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ అన్నం.. మనం చాలా సులభంగా చేసుకోవచ్చు.
4/5ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక రెండు నిమ్మకాయలు పిండుకోవాలి. ఆ తరువాత బాంధలిలో.. నూనె పోసి కొద్దిగా వేరుశెనగ పప్పులు, జీలకర్ర, ఆవాలు ఉద్దిపప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న అన్నం లేకపోతే ముందు రోజు రాత్రి మిగిలిపోయిన అన్నం లో అయినా.. మనం ముందుగా పిండుకున్న నిమ్మకాయ రసం.. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని.. మనం తిరగమాత పెట్టుకున్న మిశ్రమం కూడా కలుపుకోవాలి.
5/5అంతే కేవలం ఐదు నిమిషాల్లో ఎంతో రుచికరంగా ఉండే నిమ్మకాయ అన్నం తయారైపోతుంది. ఇక ఈ అన్నం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.