Bigg Boss Lesbian Couple: బిగ్‌బాస్.. ఈ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని ఇండస్ట్రీలలో ఈ షో రసవత్తరంగా సాగుతోంది. అయితే మళయాళం బిగ్‌బాస్‌లోకి ఓ లెస్బియన్ జంట ఎంట్రీ ఇచ్చింది. వీరిద్దరూ కలిసి ఒకే కంటెస్టెంట్‌గా కలిపే ఆడుతున్నారు. ఇక వీరి లవ్ స్టోరీలో ఉన్న సస్పెన్స్‌తో ఏకంగా ఓ సినిమాగా కూడా తీయొచ్చు. మరి ఆ లెస్బియన్ జంట ఎవరో తెలుసుకుందామా..?
1/6ప్రస్తుతం అన్ని సినిమా రంగాల్లో బిగ్ బాస్ షో బాగా గుర్తింపు పొందుతోంది. మలయాళంలో కూడా బిగ్ బాస్ సీజన్ 7 జోరుగా సాగుతోంది. ఈ షో మొదలై కొన్ని వారాలు కూడా గడిచాయి. ఈ సీజన్‌లో ఒక లెస్బియన్ జంట కూడా వచ్చింది. వీరిద్దరూ కలిసి ఒకే కంటెస్టెంట్‌గా షోలోకి అడుగుపెట్టారు.
2/6వీరి పేరు అదిలా నూరా. కేరళకు చెందిన అదిలా నసరైన్, ఫాతిమా నూరా ఇద్దరూ లెస్బియన్ జంట. వీరు సోషల్ మీడియాలో అదిలా నూరాగా బాగా పాపులర్ అయ్యారు. వీరిద్దరూ సౌదీ అరేబియాలో చదువుతున్నప్పుడు ఇంటర్‌లో పరిచయం అయ్యారు. అక్కడ నుంచి వీరి మధ్య ప్రేమ మొదలైంది.
3/6తర్వాత వీరి కుటుంబాలు కేరళలోని కోజికోడ్‌లో ఒకే కాలేజీలో చేర్చాలని నిర్ణయించాయి. అదిలా, నూరా కూడా చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ వీరి ప్రేమ విషయం కుటుంబాలకు తెలిసిపోయింది. దీంతో వారిని కాలేజీలో చేర్చలేదు.
4/6అదిలా, నూరా ఇంటి నుంచి పారిపోయి కోజికోడ్‌లో దాక్కున్నారు. అదిలా కుటుంబం ఆమెను వెతికి పట్టుకొని కొట్టి మరి తీసుకెళ్లింది. ఇంకోవైపు నూరా కుటుంబం అదిలా కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొంతకాలం వీరిద్దరూ కుటుంబాల వల్ల దూరంగా ఉన్నారు. తర్వాత అదిలా హైకోర్టులో తమ ప్రేమ, పెళ్లికి అనుమతి కోసం పిటిషన్ వేసింది.
5/6అంతేకాకుండా నూరా సోషల్ మీడియాలో లైవ్‌లో మాట్లాడి ప్రజల సానుభూతి పొందింది. దీంతో వీరిద్దరూ వైరల్ అయ్యారు. కేరళ హైకోర్టు వీరి పెళ్లికి అనుమతి ఇచ్చింది. 2022లో వీరు పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట్లో బాగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు వీరు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా పేరు తెచ్చుకున్నారు.
6/6అంతేకాదు, సైబర్ సెక్యూరిటీ రంగంలో అదిలా నూరా ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇటీవల మలయాళ బిగ్ బాస్ సీజన్ 7లో కలిసి పాల్గొనడంతో మళ్లీ వైరల్ అయ్యారు. షోలో వీరికి మంచి మద్దతు ఉంది. బిగ్ బాస్ టైటిల్ గెలుస్తారేమో చూడాలి. ఈ షోను హోస్ట్ చేస్తున్న మోహన్ లాల్ వీరిని ప్రశంసించి, తన ఇంటికి ఆహ్వానించారు.