Lionel Messi Fitness Secrets: నేడు అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ రానున్నారు. ఇప్పటికే కోల్‌కతా ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. అయితే ఈ దిగ్గజ క్రికెట్ ప్లేయర్ డైట్, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచ దిగ్గజాలలో ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ ఇప్పుడు భారత్ మొత్తం మెస్సీ మాయలో పడింది. హైదరాబాద్ కూడా మెస్సీ ఫీవర్ చుట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఫాలో అయ్యే డైట్, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.
1/72022లో అర్జెంటీనాకు వరల్డ్ కప్ తీసుకువచ్చారు ఈ దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్. మెస్సీ ఈ ఆటకు తగిన డైట్ పాటిస్తారట. స్పీడ్, స్టామినా, డైట్ ఈ మూడు కలిపి మెస్సీని ఆ స్థాయిలో నిలిచేలా చేశాయి. కోచ్ ఇచ్చే ఎప్పటికప్పటి సలహా, సూచనలు పాటిస్తూనే డైటీషియన్ టిప్స్ తో అయినా ఫిట్నెస్ నిర్వహిస్తారు.
2/7మెస్సీ జీవితమే వర్కౌట్‌గా మార్చేసుకున్నాడు. అది ఫుట్‌బాల్ ఆడినప్పుడు స్పీడ్ కోల్పోకుండా ఉండడానికి వర్కౌట్ తప్పనిసరి. ప్రధానంగా అతడు పిల్లర్ బ్రిడ్జి, ఫ్రంట్ పిల్లర్ స్కిప్స్ తరచూ చేస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాదు స్ప్లిట్ స్కౌట్స్ ఇది కోర్ కాళ్ల కండరాలను బలంగా మారుస్తుంది.
3/7మెస్సీ తరచూ చేసే ఎక్సర్ సైజ్ పిల్లర్ స్కిప్స్, స్కిప్పింగ్ రోప్స్, స్కౌట్స్ ఇది కాళ్ల కండరాలను బలంగా మారుస్తుంది. స్కిప్పింగ్ దీంతో పాటు దానికి తన డైట్‌కు తగిన నీటిని తీసుకోవటం.. అంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి హైడ్రేషన్ కోసం ఆయన లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటారు.
4/7ఫుట్‌బాల్ సామర్థ్యం పెంచుకోవడానికి మెస్సీ ఎప్పటికప్పుడు చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారంట. ఒక ఇటాలియన్ న్యూట్రిషన్ అయిన గువాలియానో ఓజర్ సలహా మేరకు ఆయన ఈ డైట్ 2014 నుంచి పాటిస్తున్నారు. ప్రధానంగా అతని ఫుడ్ లో ఎక్కువ శాతం నీరు, ఆలివ్ ఆయిల్, తృణ ధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇస్తారు .
5/7వీటితో పాటు ఆయన డైట్ లో గింజలు, విత్తనాలు కూడా చేర్చుకుంటారు. షుగర్ పూర్తిగా తీసుకోకుండా ఉంటారు. ఎందుకంటే షుగర్ వల్ల కండరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో పాటు రిఫైన్ చేసిన పిండి పదార్థాలు కూడా దూరంగా ఉంటారు. అర్జెంటీనా వాసులు ఎక్కువ శాతం నాన్ వెజ్ తింటారు. కానీ మెస్సీ మితంగానే తీసుకుంటారు.
6/7యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే 'మేట్ టీ' తీసుకుంటారు. ఇందులో విటమిన్ బీ, సీ ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి, ఆరోగ్యకరమైన నిద్రకు తోడ్పడుతాయి. ఆయన ఫేవరెట్ ఫుడ్ ఆలివ్ ఆయిల్, స్మాష్ చేసిన వెల్లుల్లి, ఉల్లి, క్యారెట్, బంగాళదుంపలు చికెన్, ఫ్రెష్ థైమీ వేసి తయారు చేసిన రోస్టెడ్ చికెన్.
7/7అయితే, ఎంత స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయినా మెస్సీకి క్యారమిల్ చాక్లెట్ , ఐస్ క్రీమ్ చూస్తే మాత్రం టెంప్ట్ అయిపోతారట. చాలా వరకు వాటిని తినకుండా దూరంగా ఉంటారు. ఈ టాలెంటెడ్ ఫుట్‌బాల్ ప్లేయర్ ఇప్పటికే 510 మిలియన్ల ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ కూడా కలిగి ఉన్నారు.