LK Advani: ఆస్పత్రిలో చేరిన బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ.. ప్రధాని మోదీ, బీజేపీ నాయకుల్లో కలవరం

LK Advani Admitted Into Appollo Hospital: బీజేపీ అగ్ర నాయకుడు, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అతడిని కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్యంపై బీజేపీ, ఎన్డీయే నాయకులు ఆందోళన చెందుతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి వివరాలు ఇలా ఉన్నాయి.

1 /7

అగ్ర నాయకత్వం: బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు.. మాజీ ఉప ప్రధాన మంత్రి లాల్‌ కృష్ణ అద్వానీ అనారోగ్యం బారిన పడ్డారు.

2 /7

వృద్ధాప్యం: 97 ఏళ్ల ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.

3 /7

అపోలో ఆస్పత్రి: వెంటనే శనివారం ఉదయం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో అద్వానీని చేర్పించారు. వైద్యులు వెంటనే చికిత్స అందిస్తున్నారు.

4 /7

పలు సమస్యలు: గతంలో కూడా అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో ఇంటికి చేరారు.

5 /7

క్షీణిస్తున్న ఆరోగ్యం: ప్రస్తుతం ఆయన వయసు మీద పడడం.. ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

6 /7

నాయకుల ఆరా: అద్వానీ ఆరోగ్య పరిస్థితిపై నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకత్వంతోపాటు ఎన్డీయే నాయకులు ఆరా తీసినట్లు సమాచారం.

7 /7

నిలకడగా: ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని ఆస్పత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి.