Lord Vishnu Most Favorite Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల వారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వారికి ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అయితే శ్రీమహావిష్ణువు అత్యంత ఇష్టమైన రాశులేవో ఇప్పుడు తెలుసుకోండి.
Lord Vishnu Most Favorite Zodiac Telugu: పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా ఆయనను సృష్టికర్తగా కూడా భావిస్తారు. అందుకే ప్రతి గురువారం ఆయనను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ఏకాదశి సమయాల్లో తప్పకుండా శ్రీమహావిష్ణువుకి ప్రత్యేకమైన ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి.. ఆయన అనుగ్రహం కూడా కలుగుతుందని సమాచారం..
1/5శ్రీమహావిష్ణును పూజించడం వల్ల జీవితంలో కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా పేదవారు కూడా ధనవంతులవుతారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన శ్రీమహావిష్ణువుకి కొన్ని రాశులు అంటే చాలా ఇష్టం. ఈ రాశుల వారికి ఆయన ఎల్లప్పుడూ మేలు చేస్తూనే ఉంటాడు. అయితే, శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రాశులేవో పూర్తి వివరాలు తెలుసుకుందాం..
2/5శుక్ర గ్రహం పాలించే ప్రతి ఒక్క రాశికి శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అందులో తులా రాశి వారు కూడా ఒకటి. తులా రాశి వారికి శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. అలాగే వీరు ఏమి కోరుకున్నా సులభంగా సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి.
3/5వృషభ రాశి వారికి శుక్రుడు పాలించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు లభించి.. జీవితంలో ఎన్నో కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే వీరికి ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక జీవితంలో ఎన్నో రకాల కష్టాల నుంచి విముక్తి పొందుతారు.
4/5శ్రీమహావిష్ణు అత్యంతగా ఇష్టపడే రాశుల్లో కర్కాటక రాశి ఒకటి. కాటక రాశి వారికి ఎల్లప్పుడూ విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశుల్లో జన్మించిన వ్యక్తులు తప్పకుండా సమాజంలో మంచి గౌరవం పొందుతారు. దీంతోపాటు విద్యలు ఊహించని విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వస్తుంది.
5/5శ్రీ మహావిష్ణువు ఇష్టపడే రాశుల్లో సింహ రాశి కూడా ఒకటి. ఈ రాశి వారికి కూడా ఆయన అనుగ్రహం లభించి భవిష్యత్తులో ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా అనుకున్న పనులు చాలా చక్కని విజయాలు సాధించగలుగుతారు. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం కూడా పొందగలుగుతారు.