LPG Gas Price Hike:దసరా పండుగకు ముందే సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర 2025 అక్టోబర్ ఒకటో తేదీన రూ.15 పెరిగింది. ఇది 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరపై వర్తిస్తుంది. అంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర. అయితే వినియోగదారులకు భారీ ఉపశమనం ఏంటంటే డొమెస్టిక్ గ్యాస్ 14 కేజీల ధరపై ఎలాంటి మార్పు లేదు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
1/5ప్రతినెల మొదటి రోజున చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆయిల్ గ్యాస్ ధరలను మార్పు చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో దసరాకు ముందే చమురు మార్కెటింగ్ కంపెనీలు బిగ్ షాక్ ఇచ్చాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.15 పెంచాయి. ఇది 19 కేజీల గ్యాస్ పై వర్తిస్తుంది.
2/5అయితే సెప్టెంబర్‌లో ఒకటో తేదీన ఈ గ్యాస్ సిలిండర్ ధరను రూ.51 తగ్గించిన సంగతి తెలిసిందే అంతకుముందు ఏప్రిల్ 1న కూడా సిలిండర్ ధరలు తగ్గిస్తాయి ఇలా నాలుగు సార్లు omc కంపెనీలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ వచ్చాయి అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు
3/5తాజాగా ఈ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఇప్పుడు రూ.15 పెంచింది. దీంతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర పెరిగిన తర్వాత రూ.1595 లకు చేరింది. ఇక కోల్‌కతలో రూ. 1700, ముంబైలో రూ.1540, చెన్నైలో రూ.1754 ఉన్నాయి.
4/5అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. హైదరాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.905, ముంబైలో రూ.852, ఢిల్లీలో రూ.853, అహ్మదాబాద్ రూ.860, లక్నో రూ.890 ధరలు ఉన్నాయి. పండుగకు ముందే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో దాని భారం హోటళ్లు, రెస్టారెంట్‌పై పడుతుంది.
5/5ఇక ఉజ్వల యోజన తో కొన్ని కోట్ల మంది మహిళలు దేశవ్యాప్తంగా లబ్ధి పొందుతున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్లు కూడా ఉచితంగా వాళ్లకి బహుమతి ఇస్తుంది. యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం దీపావళికి ముందే ఒకటి. 85 కోట్ల మంది మహిళలకు ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను కూడా ప్రకటించింది