Add Zee Business As A Preferred Source
App

Lucky Wife Zodiac Signs: ఈ రాశి అమ్మాయిలు భర్తకు అత్తింటికి అదృష్టం తీసుకొచ్చే దేవతలు..

Written ByTA Kiran Kumar
Published: Sep 27, 2025, 11:05 AM IST|Updated: Sep 27, 2025, 11:05 AM IST

Lucky Wife Zodiac Signs: గ్రహ మండంలో పన్నెండు రాశులున్నాయి. ఇందులో ఏది తక్కువ కాదు.. ఏది ఎక్కువ కాదు. కొన్ని గ్రహాలు కొన్ని రాశుల్లో ఉండగా పుట్టిన అమ్మాయిలు.. భర్తకు, అత్తింటికి అదృష్టం తీసుకొచ్చే దేవతలుగా మారుతారు. వారి రాకతో ఇంట్లో ధన ధాన్యాలతో పాటు ఇంట్లో ఆనందం వెల్లి విరుస్తుందని శాస్త్రాలు చెబుతున్న మాట. 

Lucky Wife Zodiac Signs1/6

లక్కీ వైఫ్ జోడియాక్ సైన్స్

Lucky Wife Zodiac Signs: ఈ రాశి అమ్మాయిలు తమ భర్తలకు అదృష్ట దేవతలు అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. వారు తాళి కట్టిన వెంటనే, భర్తతో పాటు అత్త వారింట్లో అదృష్టంతో సంపదలతో ఆ ఇల్లు వెలిగిపోతుందట.  ఇంతకీ ఏమిటా రాశులనేగా మీ డౌటు.. 

Vrushabha Rasi 2/6

వృషభ రాశి

వృషభ రాశి: ఈ రాశి స్త్రీలకు దైవిక శక్తితో పాటు ప్రత్యేకంగా అమ్మవారి ఆశీర్వాద బలం తోడుగా ఉంటాయట. వారిని కోడళ్ళుగా కలిగి ఉన్న కుటుంబానికి అదృష్టంతో పాటు పూర్వీకులు ఆస్తులు కలిసొచ్చే అవకాశాలున్నాయట. అంతేకాదు జీవితంలో కొత్త పురోగతిని అందుకుంటారు. 

 

Kanya Rasi 3/6

కన్య రాశి

కన్య రాశి- కన్యరాశిని అమ్మాయి అత్తారింటితో పాటు పుట్టింటికి పేరు తీసుకొచ్చారు. భర్త యొక్క అన్ని కష్టాలను తొలిగిస్తారట. వారు ఇంటికి కీర్తి ప్రతిష్ఠలను తీసుకొచ్చారట. అంతేకాదు అందరినీ జాగ్రత్తగా చూసుకుంటారు. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. వీరికి సమాజంలో ఉన్నత స్థాయి గౌరవం లభిస్తుంది.

 

Meena Rasi 4/6

మీన రాశి

మీన రాశి: మీన రాశి అమ్మాయిలు ఏ ఇంట్లో అడుగుపెడితే ఆ ఇంట్లో ధనలక్ష్మీ తాండవం చేస్తుందట.  ఈ అమ్మాయిలు ప్రవేశించే ఇంట్లో ఆనందం  శ్రేయస్సు వెల్లి విరుస్తాయి. భర్త ఆదాయం కూడా అమాంతం పెరుగుతుంది. ఈ అమ్మాయిలు చాలా నేర్పరులు. 

 

Tula Rasi 5/6

తుల రాశి

తుల రాశి: తులా రాశి వారు తాళి కట్టిన వెంటనే భర్త అదృష్టం బంక పట్టినట్టు పడుతుందట. అంతేకాదు అత్తవారింటికి వారికి తల్లి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయట. వారు చాలా అదృష్టవంతులు వీరికి ధన లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. వారు తమ కృషితో అందరి హృదయాలను గెలుచుకుంటారు.

Disclaimer6/6

గమనిక

గమనిక: ప్రియమైన పాఠకులారా, ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ,  మతపరమైన పంచాంగంతో పాటు సనాతన హిందూ సంప్రదాయంలో ఉన్న విషయాలను మేము ప్రస్తావించాము.  జీ  న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు.