Lucky Rasi Phalalu 2025: ముఖ్యంగా మే మూడవ వారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన లాభాలు కలగడమే కాకుండా.. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగు పడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి.
Weekly Lucky Rasi Phalalu In Telugu 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ కదలికలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో నక్షత్ర సంచారంతో పాటు గ్రహ సంచారం కూడా చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తిరోగమనం కూడా చేస్తుంది. ఇలా చేసినప్పుడు ఏర్పడే ప్రభావం అందరి జీవితాల్లో కీలక మార్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు సంచారం చేసినప్పుడు అన్ని రాశుల వారిపై సానుకూలమైన ప్రభావం పడుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే మూడో వారం చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే మే 14వ తేదీన బృహస్పతి గ్రహం మిథున రాశిలోకి సంచారం చేయబోతోంది. అలాగే కేతు గ్రహం సింహరాశిలోకి, రాహు గ్రహం కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాయి.. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై సానుకూలమైన ప్రభావం పడుతుంది.
ముఖ్యంగా నాలుగు గ్రహాలు ఈ వారంలోని కదలికలు జరపబోతున్నాయి. దీని కారణంగా ధనస్సు రాశి వారు ఈ వారం బోలెడు లాభాలు పొందగలుగుతారు. అలాగే పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో అద్భుతమైన ఆఫర్స్ లభిస్తాయి. అంతేకాకుండా సానుకూల మార్పులతో ముందుకు సాగుతారు.
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మాటలతో సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేసేవారు అద్భుతమైన ఆఫర్స్ పొందగలుగుతారు. దీంతోపాటు కీర్తి, ప్రతిష్టలు కూడా లభిస్తాయి. అలాగే ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది.
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం నుంచి గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది. వీరికి సూర్యుడు అధిపతిగా వ్యవహరిస్తాడు కాబట్టి అనుకున్న పనులన్నీ పెండింగ్లో లేకుండా పూర్తవుతాయి. గతంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడుతుంది. కేతువు సంచారంతో మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడుతుంది.
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు మే 14వ తేదీ నుంచి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఉన్నతాధికారుల మంచి సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అలాగే వీరు ఈ సమయంలో శుభవార్తలు కూడా వింటారు. ముఖ్యంగా భవిష్యత్తులో విజయాలు పొందేందుకు అద్భుతమైన కెరీర్ను నిర్మించుకుంటారు.