Add Zee Business As A Preferred Source
App

Lunar Ellipse 2025: రాహుగ్రస్థ చంద్ర గ్రహణం.. గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొవాలి..?.. పండితుల సూచనలివే..

Written ByInamdar Paresh
Published: Sep 01, 2025, 04:57 PM IST|Updated: Sep 01, 2025, 05:01 PM IST

Chandra grahan Effect on Pregnant women: సెప్టెంబర్ 7వ తేదీన రాహుగ్రస్థ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ప్రెగ్నెంట్ మహిళలు తప్పకుండా తీసుకొవాల్సిన జాగ్రత్తల గురించి పండితులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
 

Lunar Ellipse 2025:1/6

చంద్ర గ్రహణం నియమాలు:

రాబోయే భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్థ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. దీన్ని ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికే బ్లడ్ మూన్ అని నామకరణం చేశారు.ఈ క్రమంలో  సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 9. 58 నిమిషాల నుంచి అర్దరాత్రి 1.26 గంటల వరకు గ్రహణ కాలం ఉంటుందని పండితులు చెబుతున్నారు. శతబిష నక్షత్రంలో కుంభరాశిలో ఈసారి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది.

chandra grahan:2/6

ప్రెగ్నెంట్ మహిళలు:

అయితే.. చంద్ర గ్రహణం మనదేశంతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, ఫిజి, అంటార్కిటికాల్లో కూడా కన్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రహణం అనగానే చాలా మంది కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు.  ముఖ్యంగా ఇంట్లో ప్రెగ్నెంట్ మహిళలు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొవాలి. ఎలాంటి పరిహరాలు పాటించాలని తరచుగా అందరు తెగ టెన్షన్ పడుతుంటారు. ఈ క్రమంలో గర్భిణులు తీసుకొవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  

pregnant womens:3/6

చంద్ర గ్రహణం ఎఫెక్ట్:

ముఖ్యంగా గ్రహణ ముట్టును పాటించేవారు  సెప్టెంబర్ 7న సాయత్రం ఆరులోపు తినేయాలి. ఆ తర్వాత సరుకుల మీద దర్భలను వేసుకొవాలి. దేవుళ్ల మీద, తాగు నీరు, ఆవకాయల మీద దర్భలను వేయాలి. ప్రెగ్నెంట్ లేడీస్ ముఖ్యంగా రాత్రిపూట అస్సలు బైటకు రాకూడదు. 

grahan effect:4/6

రాహుగ్రస్థ చంద్రగ్రహణం:

కాళ్ల మీద కాళ్లు పెట్టుకుని కూర్చొకూడదు. నిటారుగా పడుకుని ఉండాలి. ఒకవైపున మరలి అస్సలు పడుకొవద్దు. మధ్య మధ్యలో లేచి నెమ్మదిగా నీళ్లను తాగాలి.  ఆకలిగా ఉంటే జ్యూస్ లు వంటివి తీసుకొవాలి. అంతే కానీ ఏ పనులు కూడా చేయకూడదు.  

Lunar Ellipse 2025 effec:5/6

భాద్రపద పౌర్ణమి:

గ్రహణంకు ముందు పట్టుస్నానం, అయిపోయక గ్రహణం విడుపు స్నానం తప్పకుండా చేయాలి.  రాత్రిపూట ద్రవపదార్థంను ఆహరంగా తీసుకొవాలి. ఆ తర్వాత మరుసటి రోజు గ్రహణ దోషం ఉన్న రాశులు శాంతి జరిపించుకోవాలి.  

grahana effect:6/6

చంద్రగ్రహణం:

కొన్ని రాశులవారికి  చంద్రగ్రహణం వల్లచెడు ప్రభావం ఉంటుంది. వీరు ముఖ్యంగా..మీనం, మిథునం, కుంభం, సింహం రాశివారు గ్రహణంను అస్సలు చూడకూడదు. గ్రహణం మరుసటి రోజు పండితుల సూచనల మేరకు దాన ధర్మాలు చేయాలి.