Add Zee Business As A Preferred Source
App

Lunar Eclipse 2025: దర్భలను గ్రహణ సమయాల్లో ఎందుకు ఉపయోగిస్తారు.. ?.. వీటికి ఆ శక్తి ఎలా వచ్చిందో తెలుసా..?

Written ByInamdar Paresh
Published: Sep 06, 2025, 07:09 PM IST|Updated: Sep 06, 2025, 07:20 PM IST

Darbha grass significance: చాలా మంది గ్రహణ సమయాల్లో తమ ఇళ్లలో తాగేనీళ్ల మీద, వంట పాత్రలు, బియ్యం సంచులు , ఆవకాయలు మొదలైన వాటి మీద దర్భలను వేసి ఉంచుతారు. అయితే.. వీటి వెనుకాల ఉన్న అసలు రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం.
 

darbha significance:1/8

చంద్ర గ్రహణప్రభావం:

మనం తరచుగా సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు రాగానే దర్భల  ప్రస్తావన ఎక్కువగా వస్తుంది. ఇంట్లో దర్భల్ని చాలా మంది తెచ్చుకుని ఇంట్లో పదార్థాల మీద, తాగే నీళ్ల మీద దర్భలను వేసుకుంటారు. అయితే..వీటికి ఆ శక్తి రావడం వెనుక కొన్ని పౌరాణిక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.  

chandragrahan effect:2/8

రాహుగ్రస్త చంద్ర గ్రహణం:

త్రేతా యుగంలో ఇంద్రుడు ఒక అసురుడితో యుద్దం చేసి అతడ్ని ఓడించి హతమారుస్తాడు. అతని శరీరం భూమి మీద ఉన్న నీళ్లలో పడుతుంది. దీంతో పంచభూతాలలో ఒకటైన వరుణుడు ఇంద్రుడి మీద కోపంతో  తనను అపవిత్రం చేశాడని వాగ్వాదంకు దిగుతాడు.  

Darbha grass effect:3/8

చంద్రగ్రహణ దోషాలు:

సమస్త ప్రాణ కోటి శుభ్రం కావాలంటే.. నీళ్లలో స్నానం చేసి శుచిగా మారుతారు. అలాంటి తనను ఈ అసురుగు తన నీళ్లలో పడటంవల్ల తాను అపవిత్రం అయిపోయానని, ఇతడి చెడు ఫలితాలు, రక్తం ప్రవహించడం వల్ల తనకు దోషాలు అంటుకున్నాయని వరుణుడు బాధపడతాంట. అప్పుడు రుషులు.. నదులు ఒడ్డులో ఉండే.. గరక దర్బలు అనే వాటితో నీళ్లలోని దోషాన్ని పోగొట్టారంట.  

darbha importance:4/8

చంద్ర గ్రహణ కాలం:

అప్పటి నుంచి ఈ దర్భలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎలాంటి దోషాలు ఉన్న కూడా దర్భాలు వాటిని దూరం చేస్తాయని ఆశీర్వదించారు.. ముఖ్యంగా పూర్వీకుల శ్రాద్దకర్మాదికాల్లో దర్భల్ని ఉంగరం వేలుకు పెట్టుకుని చేస్తారు. దర్భసనం మీద కూర్చని దేవుడ్ని ధ్యానిస్తే వెంటనే ఏకాగ్రత కుదిరి దేవుడు ప్రసన్నం అవుతాడని వరం ఇచ్చారు.   

Chandra grahan:5/8

దర్భల ఉపయోగాలు:

అంతే కాకుడా.. ఒకసారి వినత, కద్రువ ఇద్దరు తోడి కోడల్లు.  కశ్యపుడి భార్యలు. ఒకసారి కద్రువ తన చెడు స్వభావంతో వినతతో ఒక పందెం కాస్తుంది. దూరంలో ఉన్న ఒక అడవిలో గుర్రంను చూస్తారు. దాని తోక నల్లగా ఉందని కద్రువ, వినతకు చెబుతుంది. దీన్ని వినత అంగీకరించదు. ఒకవేళ పందెంలో ఎవరు ఓడిపోతే వారు జీవితాంతం దాస్యం చేయాలి చెప్పుకుంటారు.   

Lunar eclipse:6/8

చంద్ర గ్రహణం ప్రభావం:

కద్రువకు నాగులు సంతానం. అప్పుడు తన కుమారుడు తక్షకుడ్ని మనస్సులో గుర్రం తోక వద్ద ఉండాలని చెబుతుంది. తక్షకుడు పాము నల్లగా ఉండి, గుర్రం తోక భాగంలోవెళ్లికూర్చుంటాడు . కద్రువ, వినత దగ్గరకు వెళ్లి చూస్తారు. దీంతో వినత ఓడిపోతుంది.తన దగ్గర దాసిగా ఉండాలని కద్రవ పట్టి పీడిస్తుంది. అయితే. . కద్రువకు గరుత్మంతుడు పుడతాడు. తన తల్లికి దాస్యం ఏవిధంగా పొతుందని కోరగా.. స్వర్గలోకం నుంచి అమృతం తీసుకుని వస్తే కద్రువ దాస్యం నుంచి విముక్తి కల్గిస్తానని చెప్పింది.   

Chandra grahan:7/8

దర్బల ప్రభావం:

ఈ క్రమంలో గరుత్మండుడు వాయు వేగంలో స్వర్గలోకం వెళ్లి ఇంద్రుడ్ని ఓడించి, అమృతంను భూమి మీదకు తీసుకొస్తాడు. అప్పుడు గరుత్మంతుడు వచ్చేటప్పుడు కొన్ని అమృతం చుక్కలు భూమిమీద ఉన్న దర్బల మీద పడతాయి.   

Lunar eclipse effect:8/8

చంద్రగ్రహణం:

దీంతో అప్పటి నుంచి దర్భలకు పవిత్రమైన అమరత్వంతో పాటు, పవిత్రత కల్గింది. అందుకే అప్పటి నుంచి దర్భలను అమృతంతో సమానంగా పురాణాల్లో చెప్పబడినాయి. అందుకే ఏ పదార్థాలను అయిన చెడు ప్రభావం పొగొట్టి, అమృతంగా మార్చే శక్తి ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి గ్రహణ సమయాల్లో, హోమాల సమయంలో, పూర్వీకుల కార్యక్రమాలు చేసేటప్పుడు దర్భలను తప్పకుండా ఉపయోగిస్తారు.