Lunar Eclipse Lucky Zodiac Signs 2025: ఈ సంవత్సరం హోలీ పండుగ మార్చి 14వ తేదీ వచ్చింది.. అయితే ఇదే సమయంలో చంద్రగ్రహణం కన్యారాశిలో సంభవించబోతోంది. ఏర్పడబోయే చంద్రగ్రహణం భారతదేశ పై ఎలాంటి ప్రభావం చూపదని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ గ్రహణానికి సంబంధించిన సూతక కాలం కూడా ఉండదని జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలుపుతున్నారు. చంద్రగ్రహణ సమయంలో ఎంతో శక్తివంతమైన బుధాదిత్య, శుక్రాదిత్య రాజయోగంతోపాటు మాలవ్య రాజయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి.
చంద్రగ్రహణం సమయంలో ఎంతో శక్తివంతమైన మూడు యోగాలు ఏర్పడబోతున్నాయి. వీటి ప్రభావం దాదాపు 15 రోజులపాటు ఉంటుందని.. ఈ సమయంలో కొన్ని రాశుల వారు అద్భుతమైన లాభాలు పొందగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన పురోగతి లభించే ఛాన్స్ ఉంది..
మార్చి 14వ తేదీ నుంచి మిధున రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం పడుతుంది.. దీనివల్ల వీరు ఈ సమయంలో ఊహించని విజయాలు సాధించగలుగుతారు. కాస్త కష్టపడితే చాలు అద్భుతమైన పురోగతి సాధించగలుగుతారు. అలాగే కుజుడు ఎఫెక్ట్ వల్ల వీరికి ఆస్తులపరంగా కూడా కలిగి వస్తుంది.
ముఖ్యంగా చంద్రగ్రహణం సమయంలో మిధున రాశి వారికి అన్నదమ్ముల సపోర్టు కూడా లభించి.. కొన్ని విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే శత్రువులకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభించడమే కాకుండా కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
తులా రాశి వారికి చంద్రగ్రహణం సమయంలో అనేక శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆస్తులపరంగా చాలా కలిసి వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించి మానసిక సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు. గొప్ప గొప్ప విజయాలను కూడా సులభంగా సాధిస్తారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కెరీర్ కు సంబంధించిన విషయాల్లో వృద్ధ లభిస్తుంది..
చంద్రగ్రహణం సమయంలో వృశ్చిక రాశి వారికి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇక అత్తమామల నుంచి కూడా ఈ చంద్రగ్రహణ సమయంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. వివాహాలు కాని వారికి ఈ సమయంలో ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి.
ధనస్సు రాశి వారికి కూడా చంద్రగ్రహణ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరు ఈ సమయంలో విజయాలు సాధించడమే.. కాకుండా ఆర్థికంగా బోలేడు లాభాలు పొందుతారు. అంతేకాకుండా అదృష్టం కూడా సహకరించి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు. 14 రోజులపాటు ధనస్సు రాశి వారికి అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది.