Madhuri Dixit Love Affair With Ajay Jadeja: మాధురి దీక్షిత్ బాలీవుడ్ అగ్ర కథానాయికగా సత్తా చాటింది. అంతేకాదు దాదాపు రెండు దశాబ్దాలుగా కథానాయికా మెస్మరైజ్ చేసింది. అయితే .. ఈమె పెళ్లికి ఈమె పలువురుతో ప్రేమాయణం నడిపింది. అందులో ప్రముఖ క్రికెటర్ అజయ్ జడేజా ఒకరు. ఈయనతో ఈమె ప్రేమ వ్యవహారం పెళ్లికి ఎందుకు దారి తీయలేదు. అసలు విషయానికొస్తే..
Madhuri Dixit Love Affair With Ajay Jadeja: బాలీవుడ్ నటీమణులు, క్రికెటర్స్ తో లవ్వాయణం ఇప్పటిది కాదు.. ఒకప్పటి షర్మిలా ఠాగూర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తో పాటు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వరకు ఎంతో మంది క్రికెటర్స్ .. కథానాయికలను పెళ్లాడారు. అందులో మాధురి దీక్షిత్.. అజయ్ జడేజా కూడా కొన్నాళ్లు తమ ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచారు.
90లలో మాధురి దీక్షిత్, అజయ్ జడేజా జంట పలు ఈవెంట్స్ లో కలిసి కనిపించారు. ఎన్నో సినిమా ఈవెంట్ లకు మాధురి.. అజయ్ జడేజాను వెంట తీసుకెళ్లేది. మరోవైపు అజయ్ జడేజా ఆడే క్రికెట్ మ్యాచ్ లకు మాధురి దీక్షిత్ వెళ్లి అతనికి నైతికంగా మద్ధతు తెలిపేది. ఓ యాడ్ షూటింగ్ లో వీళ్లిద్దరు తొలిసారి కలిసి నటించారు. అప్పటి నుంచి వీళ్లిద్దరు ఒకరి ప్రేమలో మరొకరు పడిపోయారు.
90 చివర్లో అజయ్ జడేజా.. తన క్రికెట్ కెరీర్ లో పీక్ స్థాయిలో ఉండగా.. మాధురి దీక్షిత్ వరుస హిట్ చిత్రాలతో దూకుడు మీదున్నారు. అయితే అప్పట్లో వీళ్లిద్దరు పీకలోతు ప్రేమలో పడిపోయారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరు కొన్నాళ్లు డేటింగ్ కూడా చేశారు. మాధురితో ప్రేమ వ్యవహారం అజయ్ జడేజా తన కుటుంబ సభ్యులకు తెలియజేసాడు. అయితే రాజ కుటుంబానికి చెందిన అజయ్ జడేజా ఫ్యామిలీ మెంబర్స్ మాధురితో పెళ్లికి అంగీకరించలేదు.
అదే సమయంలో 2000లో సీబీఐ.. అజయ్ జడేజా సహా మహ్మద్ అజారుద్దీన్, మనోజ్ ప్రభాకర్, అలీ ఇరానీ, హాన్సీ క్రోంజే, సలీం మాలిక్ లు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణానికి పాల్పడ్డాని నిర్ధారించింది. సెంట్రల్ బ్యూర్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు తర్వాత..K. మాధవన్ సిఫార్సు మేరకు, BCCI అజయ్ జడేజాను ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.
కానీ 2003లో ఢిల్లీ కోర్టు అజయ్ జడేజాపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. దీంతో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం నేపథ్యంలో అతని ఇమేజ్ మసక బారింది. 2003లో, ఢిల్లీ కోర్టు అతని నిషేధాన్ని ఎత్తివేసింది, అయినప్పటికీ అతను క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల తర్వాత మాధురీ దీక్షిత్ తో ఆయనతో సంబంధాన్ని తెగ తెంపులు చేసుకుంది.
అజయ్ జడేజా కు నటుడు కావాలనే కోరిక ఉండేది. మాధురి దీక్షిత్ సహాయంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. కానీ అప్పట్లో అతని కల నెరవేరలేదు. ఆ తర్వాత సన్ని దేవోల్, సునీల్ శెట్టి.. ‘ఖేల్’ మూవీతో ఎలాగో అలా నటుడిగా బీటౌన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వా ‘ఝలక్ దిక్ లాజా’, కామెడీ సర్కస్, ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ సహా పలు రియాలిటీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. పలు క్రికెట్ మ్యాచ్ లకు కామెంటేటర్ గా వ్యవహరించారు.
మాధురి దీక్షిత్ తో బ్రేకప్ తర్వాత .. అజయ్ జడేజా ప్రముఖ రాజకీయ నాయకురాలు జయ జైట్లీ కుమార్తె అదితి జైట్లీని వివాహాం చేసుకున్నాడు. వీళ్లిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు. ఇక మాధురి దీక్షిత్.. అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీరామ్ నెనే ను వివాహాం చేసుకుంది. వీళ్లిద్దరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. ప్రస్తుతం మాధురి దీక్షిత్.. పలు రియాలిటీ షోలతో పాటు సినిమాలు చేస్తోంది.