Add Zee Business As A Preferred Source
App

Nayanthara: చిక్కుల్లో నయన తార.. బిగ్ షాక్ ఇచ్చిన మద్రాసు హైకోర్టు..అసలు మ్యాటర్ ఏంటంటే..?

Written ByInamdar Paresh
Published: Sep 10, 2025, 05:24 PM IST|Updated: Sep 10, 2025, 05:27 PM IST

Nayanthara Netflix documentary:  లేడీ సూపర్‌స్టార్‌గా పేరు పొందిన నయనతార న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఈ క్రమంలో ఆమె జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ అనే డాక్యుమెంటరీ ఇప్పటికే వివాదాదస్పదంగా మారింది.
 

Nayanthara:1/6

నయన తార వివాదం:

నయన తారకు మద్రాస్ హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. గతంలో చంద్రముఖి సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్పులను నాను రౌడీదాన్ మూవీలో అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని చంద్ర ముఖి నిర్మాతలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. 

Tollywood:2/6

టాలీవుడ్:

ఈ మూవీకి  సంబందించి ఇద్దరు నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. చంద్రముఖికి  సంబంధించి తెరవెనుక ఫుటేజీని వాడుకోవడం కూడా అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఆయా చిత్రాల నిర్మాతలు ఆరోపిస్తున్నారు.   

Nayanthara Netflix documentary: 3/6

నాయనతార నెట్ ఫ్లిక్స్ :

ఇది కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించడమేనని వారు పేర్కొన్నారు. దీంతో ‘చంద్రముఖి’ నిర్మాత ఏపీ ఇంటర్నేషనల్, ‘నాన్ రౌడీ ధాన్’ నిర్మాత అయిన నటుడు ధనుష్‌కు చెందిన నిర్మాణ సంస్థ కలిసి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశాయి.  

nayanthara controversy:4/6

నయనతార వివాదం:

బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, నయనతారతో పాటు ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు కూడా తాజాగా నోటీసులు జారీ చేసింది.

chandramukhi movie:5/6

నయన తార:

ఈ వివాదంపై అక్టోబర్ 6వ తేదీలోగా తమ వివరణ సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో ఈ వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ నోటీసులపై నయనతార, నెట్‌ఫ్లిక్స్‌ ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. 

madras high court:6/6

మద్రాస్ హైకోర్టు:

మరోవైపు.. ఇప్పటికే.. తన పర్మిషన్ తీసుకోకుండానే 'నానుమ్ రౌడీ డాన్' అనే సినిమాలోని ఫుటేజ్ ని ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారని ఆ సినిమా నిర్మాత, నటుడు ధనుష్... నయనతారకు లీగల్ నోటీసులు పంపారు. మూడు సెకండ్ల నిడివి ఉన్న క్లిప్ ను వాడుకున్నందుకు ధనుష్ నష్ట పరిహారంగా ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.