Add Zee Business As A Preferred Source
App

Mahalaya Amavasya 2025: రేపే మహాలయ అమావాస్య.. ఈ తప్పు పొరపాటున చేయకూడదు!

Written ByRenuka Godugu
Published: Sep 20, 2025, 08:30 AM IST|Updated: Sep 20, 2025, 08:30 AM IST

Do Not Do On Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య దీన్ని సర్వపితృ అమావాస్య పెత్తర అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజు పితరులకు సంబంధించినది. ప్రతి ఏడాది పితృ దినోత్సవాలు 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సమయంలో మన పితరులు భూమిపై సంచరిస్తారు అనే నమ్మకం ఉంది. అయితే రేపు సర్వపితృ అమావాస్యతో ఇది ముగుస్తుంది. అయితే, పెత్తర అమావాస్య రోజు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం.
 

Sarva Pitru Amavasya1/5

సర్వపితృ అమావాస్య

2025 సెప్టెంబర్ 21వ తేదీ సర్వపితృ అమావాస్య. దీన్ని మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇది పితరులకు సంబంధించిన ఈరోజు కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. అవి నిషిద్ధం.  

Shradda2/5

శ్రద్ధం

పెత్తర అమావాస్య రోజు శ్రద్ధం, కర్మలు వంటివి చేస్తారు. పితరులకు పిండదానాలు చేసే ఆచారం ఉంది. ప్రతి ఏడాది 15 రోజుల పాటు పితరులకు కేటాయిస్తారు. అదే పితృపక్షం అంటారు.  

Pitru3/5

పితరులు

 ఈ సమయంలో మన పితరులు భూమిపై సంచరిస్తారని శ్రద్ధ, కర్మాలు వంటివి నిర్వహిస్తారు. పిండ ప్రదానాలు చేస్తారు. నల్ల నువ్వులతో నీటిని వదిలే ఆనవాయితీ కూడా ఉంది. తద్వారా పూర్వీకులకు మోక్షం కలుగుతుందని నమ్ముతారు. వారి సంతానానికి ఆనందం శ్రేయస్సు కలిసి వస్తుంది.  

Pettara Amavasya4/5

 పెత్తర అమావాస్య

 పెత్తర అమావాస్య రోజు కొత్త కారు, ఇల్లు వంటివి కొనుగోలు చేయకూడదు. ఏ శుభకార్యాలు చేయకూడదు. ఈరోజు కేవలం ఇతరులకు మాత్రమే సంబంధించింది. కొత్త బట్టలు ధరించడం కూడా నిషిద్ధం.  

Mahalaya amavasya5/5

మహాలయ అమావాస్య

 అయితే మహాలయ అమావాస్య రోజు కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఈరోజు ఎవరైనా పేదవారు దానం కోసం వస్తే వారిని ఏమి ఇవ్వకుండా తిరిగి పంపకండి. అంతేకాదు ఎవరితోనూ కోపంతో మాట్లాడకూడదు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)