Pitru Paksha 2025: మనం కాలాన్ని కొన్ని భాగాలుగా విభజించాము. అందులో వారం, పక్షం, మండలం ఇలా.ఇక పక్షం అంటే 15 రోజులు. రెండు పక్షాలు అంటే 30 రోజులు. ఇలా భాద్రపదంలోని కృష్ణపక్షాన్ని మహాలయ పక్షంగా సంభోదిస్తుంటారు. ఈ 15 రోజుల్లో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందనేది వివిధ పురాణాల ఆధారంగా, పెద్దులు శాస్త్ర ప్రకారం ఏ తిథి రోజున ఎపుడు శ్రాద్ద ప్రక్రియలు నిర్వహించంటే..
1/8Pitru Paksha 2025: భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన దినాలు. మహాలయ పక్షములో పితరులు అన్నంతో పాటు నీటిని ప్రతిరోజు కోరుకుంటారు. ముఖ్యంగా ఈ పక్షాల్లో తండ్రి చనిపోయిన తిథి రోజున లేదా మహాలయ పక్షములలో పితృ తర్పణములు, యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే, పితృ దేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారనేది ప్రతీతి. తమ వంశాభివృద్ధి జరుగుతుంది. వారు ఉత్తమ గతిని పొందుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు , ధర్మ సింధువు , నిర్ణయ దీపికా గ్రంథల్లో ఉన్నాయి.
2/8భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవ పదము, కృష్ణపక్షం పితృ పదము, అదే మహాలయ పక్షము. మహాలయమంటే - మహాన్ అలయః, మహాన్‌లయః మహల్ అలం యాతీతివా అనగా పితృ దేవతలకిది గొప్ప ఆలయము. పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట అని అర్థములున్నాయి.
3/8అమావాస్య అంతరార్థం: ‘‘అమా’ అంటే ‘‘దానితోపాటు’’, ‘వాస్య’ అంటే వహించటం. చంద్రుడు, సూర్యుడిలో చేరి, సూర్యుడితో పాటు వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు. భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మ గ్రంథాలు తెలుపుతున్నాయి.మహాలయ పక్ష ప్రారంభం నుండి పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి.
4/8పాడ్యమి తిధి రోజు శ్రార్ధము పెడితే లక్ష్మి కటాక్షం కలుగుతుంది.విదియ లో శ్రార్ధము పెడితే సంతాన ప్రాప్తి సంప్రాతిస్తుందట. తదియ రోజున శ్రార్థ కర్మ నిర్వహిస్తే.. మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది.చవితి తిథిన శ్రాధ్ధము పెడితే అజాత శత్రువులవుతారు.పంచమిన శ్రార్ధము పెడితే సకల సౌభాగ్యములు కలుగజేయును.
5/8షష్టి రోజు ఇతరులకు పూజ్యనీయులుగా చేయును.సప్తమి రోజు పరలోకంలో ఒక దేవగోష్టికి నాయకునిగా చేయును. అష్టమీ రోజు మంచి మేధస్సును చేకూర్చును.నవమి మంచి భార్యను సమ కూర్చును. గయ్యాళియైన భార్య కూడా బుధ్దిమంతురాలిని చేయునేది ప్రతీతి. మరో జన్మలో కూడా మంచి భార్య లభిస్తుందట. దశమి తిధి రోజున చేసే శ్రాద్ధ కర్మల వల్ల కోరిన కోరికలను నేరవేరును.
6/8ఏకాదశి రోజున సకల వేదవిద్యా పారంగతులను చేయును.ద్వాదశి రోజున పెట్టే శ్రాద్ధ కర్మల వలన ఇళ్లు బంగారు మయం అగును. త్రయోదశి రోజున చేసే కర్మల వలన సత్సంతానాన్ని పొందుతారు. మేధస్సును, పశు ,పుష్టి సమృద్ధి , దీర్ఘఆయుష్షు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చున.చతుర్దశి తిథిన చేసే వాస్త్రం లేక అగ్ని (ప్రస్తుత కాలంలో రైలు , మోటారు వాహనములు వల్ల విపత్తు) వీని మూలంగా మరణం సంభవించిన వార్లకు మహలయ శ్రార్ధము చేయవలయును. అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుందట.అమావాస్య రోజున సకలాభిష్టములు సిద్దించును
7/8పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలోగల లోపములను నివృత్తిచేసీ పరిపూర్ణతను చేకూర్చును.ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలనేది శాస్త్ర వచనం.
8/8ఆర్దిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే, పితృ పక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు. అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయం లో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి , పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు , పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.