Mahesh Babu Controversy: మహేష్ బాబు ఒక సినిమా షూటింగ్ సమయంలో ఒక హీరోయిన్ తో అలాంటి పని చేయను అని చెప్పడంతో.. ఆ హీరోయిన్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ హీరోయిన్ ఆ సినిమా అయ్యేంతవరకు కూడా మహేష్ బాబు తో మాట్లాడలేదంట.. ఇంతకు ఆమె ఎవరు అంటే..
1/5ఒక సినిమా అనుకున్నప్పుడు కథకు తగ్గట్టుగా నటీనటులు నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో తప్పని పరిస్థితుల్లో డైరెక్టర్లకి కూడా ఎదురు తిరిగిన హీరోలు హీరోయిన్లు ఉన్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా తనకు నచ్చని పని చేయను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక దాంతో ఆ హీరోయిన్ కూడా తనతో అలా చేయడానికి ఇష్టం చూపని మహేష్ బాబుకి గట్టి ఝలక్ ఇచ్చింది.
2/5అసలు విషయంలోకి వెళ్తే ఇంట్రోవర్ట్ అయిన మహేష్ బాబు డైరెక్టర్ చెప్పింది చెప్పినట్టు చేస్తూ వెళ్లిపోయే రకం. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాఘవేంద్రరావు హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ చేయాలి అని ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు పెట్టి మహేష్ బాబు తో పాటు ప్రీతిజింటాను కూడా తాగమని ఒక సీన్ ను క్రియేట్ చేశారు.
3/5అయితే డైరెక్టర్ చెప్పినట్టు ప్రీతి జింటా ఆ కూల్ డ్రింక్ తాగినా.. మహేష్ బాబు మాత్రం హీరోయిన్ ఎంగిలి చేసిన కూల్డ్రింక్ ను తాను తాగనని మొహం మీదే చెప్పేసాడట. అందుకు రాఘవేంద్రరావు సీను బాగా వస్తుందని మహేష్ బాబును కన్విన్స్ చేసినా మహేష్ బాబు మాత్రం తాగనని తెగేసి చెప్పి షూటింగ్ నుండి ఇంటికి వెళ్లిపోయారట.
4/5అలా ఆరోజు షూటింగ్ క్యాన్సిల్ అవడంతో.. మరుసటి రోజు ఆ సీను మరోలా తీస్తానని చెప్పి.. వీరిద్దరికీ సపరేట్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ తెప్పించి.. ఆఖరికి చీటింగ్ చేసి ఒకే కూల్డ్రింక్ లో రెండు స్ట్రాలు పెట్టి తాగినట్టు చూపిస్తూ క్లోజ్ షార్ట్ లో మేనేజ్ చేశారు.
5/5అలా మహేష్ బాబు వింత బిహేవియర్ ను చూసిన ప్రీతిజింటా అప్పటి నుండీ షూటింగ్ కంప్లీట్ అయ్యేంతవరకు మహేష్ బాబుతో మాట్లాడలేదట. అలా ఎలాగోలా రాజకుమారుడు సినిమా 1999 లో రిలీజ్ అవ్వగా.. సక్సస్ కొట్టడంతో కృష్ణ ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.