Mahesh Babu Actress : ఒకప్పుడు మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా చేసిన నటి.. వరుసగా టాప్.. కంపెనీలో నటించి ఏకంగా ఒక కంపెనీకి సీఈవోగా కూడా చేసింది. ఇప్పటికీ కూడా కెరియర్ పరంగా ఆమె దూసుకుపోతోంది. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఇంతకీ ఆ కంపెనీ ఏమిటి అన్న పూర్తి వివరాలు లోకి వెళితే..
1/5మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగాన్ని ఏలుతోంది హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరు అంటే. మయూరి కంగో. మయూరీ కి సినిమాల్లోకి రాకము.. ఐఐటి కాన్పూర్ నుంచి అడ్మిషన్ లభించింది. కానీ బాలీవుడ్ తనకు పిలుపునిచ్చినపుడు.. ఆమె చదువును వదిలి నటనా రంగంలో అడుగుపెట్టింది. ఆమె 1995లో ‘నసీం’ సినిమాలో హీరోయిన్‌గా డెబ్యూ చేసింది.
2/5మహేష్ భట్ ఆమె ప్రతిభను గుర్తించి..తన సినిమాలో ప్రధాన పాత్రలో తీసుకున్నారు. ఈ సినిమా స్వీటీ అనే వ్యక్తిత్వమున్న ఒక అమ్మాయి.. తన తండ్రిని వెతుక్కోవడానికి సెయిషెల్స్ కి వెళ్లడం అని కథ చుట్టూ తిరుగుతుంది. సినిమా పెద్ద హిట్ కాకపోయినా..రాజేష్ రోషన్ సంగీతం హిట్ అయ్యింది.
3/5ఆ తర్వాత ఆమె బెటాబీ (1997).. హోగీ ప్యార్ కి జీత్ (1999), బదల్ (2000) వంటి సినిమాల్లో నటించింది. దక్షిణ భారత సినీ పరిశ్రమలో కూడా కొంత కాలం అవకాశాలు ప్రయత్నించింది. ఆ సమయంలో మహేష్ బాబు అన్న సరసన వంశి (2000) సినిమాలో నటించింది.
4/52003లో NRI ఆదిత్య ధిల్లాన్ తో వివాహం చేసుకుని అమెరికాకు వెళ్ళిన తర్వాత.. మయూరి సినిమాలకు వీడ్కోలు చెప్పింది. అక్కడ ఆమె సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూ యార్క్-బ్యారుక్ కాలేజీ నుంచి MBA పూర్తి చేసి, కార్పొరేట్ కెరీర్ ను ప్రారంభించింది.
5/52019 లో Google ఇండియాలో Industry Head గా చేరి, కొంతకాలం సేవలు అందించింది. ఆ తర్వాత Publicis Groupe లో Global Delivery Division CEO గా చేసింది. ప్రస్తుతం ఆమె ఇండియాలో కుటుంబంతో గృహిణి జీవితాన్ని ఆనందిస్తూ, లింక్డ్ఇన్ లో “passionate marketer”గా తన ప్రొఫెషనల్ రంగాన్ని కొనసాగిస్తుంది.