Major Rishabh Singh Sambyal: భారత ఆర్మీకి చెందిన పారా కమాండో అధికారి మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారారు జమ్మూకు చెందిన డోగ్రా రాజ్‌పుత్ అయిన ఆయన, 2021లో రిపబ్లిక్ డే పరేడ్‌లో జాట్ రెజిమెంట్ బృందానికి కెప్టెన్‌గా నాయకత్వం వహించి బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ ట్రోఫీ గెలిపించారు. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ADCగా సేవలందిస్తున్నారు
1/7President ADC: భారత సైన్యంలో పేరు గాంచిన పారా కమాండో అధికారి మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ ఇప్పుడు దేశంలోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా పెద్ద స్టార్‌గా మారారు. ఆయనను చూసిన వారెవరైనా ఇదే అసలు ఆఫీసర్ లుక్ అని అనకుండా ఉండలేరు. గంభీరమైన సైనిక భంగిమ, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ప్రశాంతమైన చిరునవ్వు ఇవన్నీ ఆయన్ను నెటిజన్ల గుండెల్లో హీరోలా నిలబెట్టాయి.
2/7జమ్మూకు చెందిన డోగ్రా రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టిన సంబ్యాల్, 2021లో రిపబ్లిక్ డే పరేడ్‌లో జాట్ రెజిమెంట్‌ను కెప్టెన్‌గా నడిపించారు. ఆయన నేతృత్వంలో బృందం బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ ట్రోఫీ ను గెలుచుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ఆ ట్రోఫీని అందజేయడం ఆ క్షణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. క్రమశిక్షణ, అద్భుతమైన లీడర్‌షిప్ చూపించి, ఇప్పటికే సైనిక వర్గాల్లో గౌరవం సంపాదించారు.
3/7ఇప్పుడు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ADC (Aide-De-Camp) గా పనిచేస్తున్నారు. ఈ పదవి సాధించడం అనేది ఒక ఆర్మీ ఆఫీసర్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘనత అని చెప్పవచ్చు. రాష్ట్రపతి షెడ్యూల్స్ చూసుకోవడం, ప్రోటోకాల్‌లు పకడ్బందీగా పాటించడం, భద్రతను సమన్వయం చేయడం వీటన్నింటిని మేజర్ సంబ్యాల్ నిర్వహిస్తున్నారు. ఇంతటి గౌరవప్రదమైన బాధ్యతలో ఉండటం ఆయనకు లభించిన విశేషమైన గుర్తింపు.
4/7మేజర్ సంబ్యాల్ సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కారణం కేవలం ఆయన అందం మాత్రమే కాదు. ఆయన చూపే సాధారణమైన ప్రవర్తన, వినయం అందరినీ ఆకట్టుకుంటోంది.
5/7ఒకసారి ఒక కార్యక్రమంలో ఆయన డ్రై ఫ్రూట్స్ తింటూ చిన్నపిల్లలా చిరునవ్వులు చిందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ క్షణం ఆయనను మరింతగా ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లింది.
6/7ఇప్పుడు ఆయన అభిమానుల పేజీలు పెరుగుతున్నాయి. కొందరు ఆయనను దేశభక్తి ప్రతీకగా పొగడుతుంటే, మరికొందరు ఇండియన్ ఆర్మీ రాక్‌స్టార్ అని పిలుస్తున్నారు. నిజంగా చెప్పాలంటే, మేజర్ సంబ్యాల్ లాంటి వ్యక్తులు యువతకు ప్రేరణ. దేశానికి సేవ చేస్తూనే, వినయం, క్రమశిక్షణతో ప్రజల మనసులు గెలుచుకోవడం ఆయన ప్రత్యేకత.
7/7మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ ఇప్పుడు కేవలం సైనిక అధికారి మాత్రమే కాదు, ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒక ఐకాన్. ఆయనను చూసి గర్వపడకుండా ఉండలేం.