Add Zee Business As A Preferred Source
App

Weight Loss Snack: మఖానా vs వేరుశనగ పప్పులు.. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఏది బెస్ట్ స్నాక్..?

Written ByVishnupriya
Published: Sep 21, 2025, 05:05 PM IST|Updated: Sep 21, 2025, 05:05 PM IST

Makhana Vs Peanuts: మోడర్న్ జీవనశైలి కారణంగా.. ఒబిసిటీ అలానే కొలెస్ట్రాల్ అనేది అందరిలోనూ చాలా వేగంగా పెరుగుతోంది. Junk food తినడం.. తక్కువ నిద్ర.. వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలు అధిక బరువుకి.. దారితీస్తాయి. ఈ సమస్యతో పోరాడేందుకు డైట్ ప్లాన్స్, డిటాక్స్ ప్రయత్నాలు.. చేసే వాళ్లకు సైతం స్నాక్స్ కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం.

Snacks For Fat Loss1/5

మఖానా vs వేరుశనగ పప్పులు

ఏవి ఎంత కంట్రోల్ చేసుకున్నా..స్నాక్స్ కంట్రోల్ మాత్రం చాలామందికి చాలా కష్టం. ముఖ్యంగా మధ్యాహ్నం అన్నం తినగానే అలానే సాయంత్రం పూట.. స్నాక్స్ ఎక్కువగా తినాలి అనిపిస్తుంది. ఈ క్రమంలో..మఖానా లేదా వేరుశనగ పప్పులు.. తినడం చాలా మంచిది. కానీ ఈ రెండిటిలో ఏది తింటే బరువు తగ్గవచ్చు అనే సందేహం కూడా కొంతమందిలో ఉంటుంది. 

Weight Loss Evening Snack2/5

మఖానా vs వేరుశనగ పప్పులు

వేరుశనగపప్పుల్లో.. ప్రోటీన్, ఫైబర్.. పోషకాలలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచడమే కాకుండా జీర్ణ క్రియకి కూడా సహాయపడతాయి. 

Peanut as Snack3/5

మఖానా vs వేరుశనగ పప్పులు

కానీ ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలి అని అనుకునేవారు..  ఒక్కసారిగా 5–6 పీనట్స్ మాత్రమే తినాలి. ఎక్కువ తిన్నట్లయితే బరువు పెరుగుతారు.

Makhana 4/5

మఖానా vs వేరుశనగ పప్పులు

మఖానా (ఫాక్స్ నట్స్/లోటస్ సీడ్స్) తక్కువ క్యాలరీలు.. కొవ్వు కలిగి ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, మినరల్స్.. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి.. ఆకలి తగ్గిస్తాయి.. ఆరోగ్యానికి.. సహాయపడతాయి. అంతేకాకుండా.. బరువు తగ్గించుకునే వారికి మఖానా సరైన స్నాక్.

Best Weight Loss Snack5/5

మఖానా vs వేరుశనగ పప్పులు

న్యూట్రిషనిస్ట్ సలహా పరంగా.. మఖానా లో.. క్యాలరీలు తక్కువగా పోషకాహారాలు ఎక్కువగా ఉన్న కారణంగా బరువు తగ్గడానికి బెస్ట్ ఛాయిస్గా నిలుస్తుంది. పీనట్స్ కూడా ఆకలి తగ్గించడానికి సహాయపడతాయి..కానీ చాలా చిన్న పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.