Malavika Mohanan:మాళవిక మోహనన్ కేరళ ముద్దుగుమ్మ అయిన ఈమె తన గ్లామర్ షోతో పాపులర్ అయింది. ఇప్పటి వరకు డబ్బింగ్ చిత్రాలతో పలకరించిన ఈమె.. ఈ ఇయర్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్' చిత్రంతో కథానాయికగా తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది.
మాళవిక మోహనన్ దక్షిణాది, హిందీ సహా దేశంలోని మెయిన్ సినీ ఇండస్ట్రీలను ఓ చుట్టు చుట్టేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఈ యేడాది ప్రభాస్ హీరోగా నటిస్తోనన్న 'ది రాజా సాబ్' చిత్రంతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు.
ప్రభాస్ 'ది రాజా సాబ్' చిత్రంతో నైనా కథానాయికగా మాళవిక మోహనన్ భారీ ఆశలే పెట్టుకుంది. ఈ చిత్రం తర్వాత మాళవికకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మాళవిక మోహనన్ తండ్రి కూడా ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్. ఈమె బిడ్డగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది.
మలయాళ సినీ ఇండస్ట్రీతో హీరోయిన్ గా పరిచయైన మాళవిక.. విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్’ చిత్రం ఈమెకు కథానాయికగా మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి.
2013లో మలయాళ చిత్రం 'పట్టామ్ పోలే' చిత్రంతో మాళవిక మోహనన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
‘పట్టామ్ పోలే’ తర్వాత ‘నిర్ణాయకం’ చిత్రాలతో తన నటనతో అట్రాక్ట్ చేసింది మాళవిక. ఆ తర్వాత శాండివుడ్‌లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మొత్తంగా సౌత్ లో అన్ని మెయిన్ ఇండస్ట్రీస్ యాక్ట్ చేసి మెప్పించింది.
హిందీలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించిన కూడా 'బియాండ్ ది క్లౌడ్స్' చిత్రంతో బీ టౌన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత‘యుద్రా’ మూవీతో పలకరించింది. కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.
మలయాళంలో ది గ్రేట్ ఫాదర్ మూవీ తర్వాత.. రజినీకాంత్ హీరోగా నటించిన 'పేట' మూవీతో మాస్‌లో మంచి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయింది.
రీసెంట్ గా ‘తంగలాన్’ మూవీతో తమిళ, తెలుగు ప్రేక్షలను మెప్పించింది. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో మాళవిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.