Manchu Vishnu: మంచు విష్ణుని రెండో పెళ్లి చేసుకోమని కోరిన భార్య.. కారణమేమిటంటే!

Manchu Vishnu wife : ప్రస్తుతం కన్నప్ప సినిమా షూటింగ్తో తెగ బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. కాగా ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు తన భార్య గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.. ఇంతకీ అవేమిటంటే..
 

1 /5

మోహన్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప త్వరలోనే విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు హీరోగా నటిస్తున్నారు. 

2 /5

కాగా గత కొద్ది రోజుల నుంచి మంచి ఫ్యామిలీలో కొన్ని తగాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఆ తగాదాలు సినిమా పైన ఎటువంటి ప్రభావం చూపివ్వకుండా.. మంచు విష్ణు ఈ సినిమా షూటింగ్ సెలవేగంగా ముగిస్తున్నారని వినికిడి.

3 /5

ఇక ఈ సినిమా విషయాలు పక్కన పెరిగితే మంచు విష్ణు తన భార్య గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరిచాయి. స్వయంగా తన భార్య తనను రెండో పెళ్లి చేసుకోమని చెప్పిందని తెలియజేశారు ఈ హీరో.   

4 /5

అసలు విషయానికి వస్తే ఒక ఇంటర్వ్యూలో మంచి విష్ణు మాట్లాడుతూ..”నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అందుకే నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. వాళ్లతో ఉన్నంతసేపు నేను సమయాన్ని చాలా సంతోషంగా గడుపుతూ ఉంటాను. నా భార్య విరానికా ని నాకు ఇంకా పిల్లలు కావాలని అడిగాను, దాంతో తను నాకు ఓపిక లేదు, వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పింది’ అంటూ చెప్పుకొచ్చారు ఈ హీరో.   

5 /5

కాగా మంచు విష్ణు కి నలుగురు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. వీరు  కూడా ‘కన్నప్ప’ చిత్రం‌లో కీలక పాత్రలు పోషించారు. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చేనెల 25న అన్ని భాషలలోనూ విడుదలకు సిద్ధమవుతోంది.