Add Zee Business As A Preferred Source
App

Mars Powerful Effect: శక్తివంతంగా మారిపోతున్న కుజుడు.. అదృష్టంతో ఈ రాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభాలు.. లక్కంటే ఈ రాశులదే..

Published: Oct 15, 2025, 11:00 AM IST|Updated: Oct 15, 2025, 11:00 AM IST

Mars Powerful Effect On Zodiac: కుజుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. దీని ప్రభావం దీపావళి సమయంలోనే ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో దీపావళి ఆనందంగా మారుతుంది. డబ్బు విపరీతంగా తిరిగి వస్తుంది.

Mars Powerful Effect On Zodiac Telugu: గ్రహాలపై అధిపతి అయిన కుజుడు నిర్దిష్ట సమయంలో మాత్రమే రాశి సంచారంతో పాటు నక్షత్ర సంచారం చేస్తాడు. ప్రస్తుతం కుజుడు విశాఖ నక్షత్రంలో సంచార దశలో ఉన్నాడు. దీపావళి తర్వాత ఇదే గ్రహం శని పాలించే అనురాధా నక్షత్రంలోకి సంచరించబోతున్నాడు. ఈ నక్షత్రానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటిది నవంబర్ ఒకటో తేదీన శని నక్షత్రంలోకి కుజుడు ప్రవేశిస్తాడు. అయితే ఈ సంచార ప్రభావం అక్టోబర్ 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 
 

Mars Astrology Telugu1/6

అనురాధ నక్షత్రం

కుజుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కుంభరాశి తో పాటు మరికొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ నక్షత్ర సంచారం వల్ల కొన్ని రాశుల వారికి జీవితంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది. అలాగే శక్తి కూడా పెరిగి కొన్ని రకాల పనులు ఎంతో త్వరగా చేయగలుగుతారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.   

Mars Planet Effect2/6

మకర రాశి 

కుజుడు నక్షత్ర సంచారం వల్ల మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో అదృష్టం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే చాలా వరకు మెరుగుపడతాయి. కృషికి తగ్గ ప్రతిఫలం లభించి.. మానసికంగా కూడా చాలా బాగుంటారు. 

Mars Planet Zodiac3/6

వృషభ రాశి 

వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడి నక్షత్ర సంచారం చాలా అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి అదృష్టం ఊహించని స్థాయిలో పెరిగి జీవితంలో ఆనందం లభిస్తుంది. అలాగే వీరికి అనుకున్న స్థాయిలో శక్తి కూడా పెరుగుతుంది. భౌతిక సుఖాలు పెరగడమే కాకుండా వ్యాపారాలు కూడా అద్భుతంగా మెరుగుపడతాయి.  

Effects Of Weak Mars In Astrology4/6

మిథున రాశి 

కుజుడి సంచారం మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి పనిలో పురోగతి లభిస్తుంది. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం ఊహించని స్థాయిలో పెరిగి.. ధన లాభాలు కూడా పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం కూడా చాలా వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

Vedic Astrology5/6

కన్యా రాశి 

కన్యా రాశి వారికి కూడా ఆర్థికంగా సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.. అంతకంటే ఎక్కువగా వ్యాపారాల్లో పురోగతి కలుగుతుంది. ఆర్థికంగా కూడా విజయాల సాధించే అదృష్టాన్ని పొందుతారు. దీనివల్ల మానసికంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.  

What Does Mars Represent In Vedic Astrology6/6

తులారాశి 

తులా రాశి వారికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే సంభాషణ కూడా చాలా మధురంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి.. నీతో పాటు కోర్టు తీర్పును మీకు అనుకూలంగా వచ్చి.. అద్భుతమైన శుభవార్తలను అందిస్తాయి.