Mars Transit 2025 Lucky Zodiac Signs in Telugu: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో నిర్దేశిత సమయంలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశులపై గణనీయమైన ప్రభావం పడనుంది. ఇందులో భాగంగా మంగళ గ్రహం గోచారం ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం.
Mars Transit 2025 Lucky Zodiac Signs in Telugu: మంగళ గ్రహాన్ని గ్రహాలకు సేనాపతిగా అభివర్ణిస్తారు. మంగళ గ్రహం త్వరలో చంద్రుని రాశిగా పిల్చుకునే కర్కాటకంలో ప్రవేశించనుంది. ఫలితంగా మూడు రాశులకు దశ తిరగనుంది. ఈ మూడు రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. ఆ మూడు లక్కీ రాశులేవో తెలుసుకుందాం.
మంగళ గ్రహం కర్కాటక రాశిలో గత ఏడాది అక్టోబర్ 20వ తేదీన కర్కాటక రాశిలో ప్రవేశించాడు. డిసెంబర్ నెలలో వక్రావస్థలో ఉన్నాడు. ఆ తరువాత జనవరిలో మిధునంలో ప్రవేశించాడు.
ఇక మంగళ గ్రహం ఏప్రిల్ 3వ తేదీన రాత్రి 1.32 గంటలకు కర్కాటక రాశిలో మార్గీకరణ చెందనున్నాడు. దాంతో అన్ని రాశులపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా జూన్ 6 వరకూ మూడు రాశులకు దశ తిరిగిపోనుంది
మంగళ గ్రహం కర్కాటకంలో ప్రవేశించడం వల్ల కన్యా రాశితోపాటు 4 రాశుల జీవితాల్లో కీలక మార్పులు రానున్నాయి. ఉద్యోగస్థులు, వ్యాపారస్థులకు అద్భుతంగా ప్రయోజనం కలగనుంది. కెరీర్ పరంగా కూడా చాలా బాగుంటుంది.
కన్యా రాశి కన్యా రాశి జాతకులపై మంగళ గ్రహం గోచారం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి, వేతనం పెంపు ఉంటుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అత్యంత అనువైన సమయం
మేష రాశి మంగళ గ్రహం గోచారం కారణంగా మేషరాశి జాతకులకు అద్భుతమైన ప్రయోజనం కలగనుంది. ఊహించని సంపద చేతికి అందుతుంది. ఫలితంగా ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. ధన సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతి కలుగుతుంది.
తులా రాశి మంగళ గ్రహం గోచారం కారణంగా తులా రాశి జాతకులకు ఊహించని లాభం కలగనుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు ఎదురౌతాయి. ఉద్యోగులకు పదోన్నతి, వేతనం పెంపు లాభిస్తుంది. అనుకోని విధంగా డబ్బులు వచ్చిపడతాయి. ఆరోగ్యపరంగా బాగుంటారు. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు.