Mars Transit 2025 Effects Zodiac: అతి త్వరలోనే కుజుడు సంచారం చేయబోతున్నాడు. సెప్టెంబర్ 13వ తేదీన తులారాశిలోకి కుజుడు ప్రవేశిస్తాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా చాలా వరకు కలిసి రాబోతోంది.
Mars Transit 2025 Effects Zodiac Telugu: గ్రహాలకు అధిపతిగా పరిగణించే కుజుడు సంచారం చేయబోతున్నాడు. ముఖ్యంగా ఈ గ్రహ సంచారం కారణంగా చాలామందికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగి.. స్వర్ణ యుగం రావడం కూడా ప్రారంభమవుతుంది. అయితే కుజుడి సంచారం ఎప్పుడు జరుగుతుందో? ఎవరికి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
1/5ఆగస్టులో కుజుడు కన్యారాశిలో సంచార దశలో ఉన్నాడు.. అంతకుముందు ఈ గ్రహం సింహరాశిలో సంచారంలో ఉంది. అయితే సెప్టెంబర్ 13న మళ్లీ కుజుడు సంచారం చేయబోతున్నాడు. ఈ నెలలో ఎంతో ప్రత్యేకత కలిగిన శుక్రుడి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి స్వర్ణ యుగం ప్రారంభమవుతుంది.
2/5శుక్రుడు గత మూడు నెలలు విధ్వంసం సృష్టించాడు.. అయితే, ఇప్పుడు తులా రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారి విధి రాత పూర్తిగా మారుతుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుస్తూ ఉంటాయి. ఆనందం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.
3/5వృశ్చిక రాశి వారికి కుజుడు సంచారం కారణంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బీరు భూములతో పాటు ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. అలాగే కొత్త కార్లతో పాటు ప్రత్యేకమైన కొన్ని వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ప్రశంసలు కూడా లభిస్తాయి. ఆదాయ వనరులు విపరీతంగా పెరిగి ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి.
4/5కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడి సంచార ప్రభావం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా వీరికి ఈ సమయంలో కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. సంపాదనతో పాటు గౌరవం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. కెరీర్ పరంగా కూడా పురోగతి లభించి.. ఊహించని లాభాలు కలుగుతాయి. జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా విపరీతంగా పెరుగుతుంది.
5/5మేష రాశి వారికి అంగారకుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి వీరికి కూడా ఈ సమయంలో ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. ఇంట్లో ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.