Add Zee Business As A Preferred Source
App

Mars Transit 2025: ఈ రాశుల వారికి ఏప్రిల్ నుంచి కుజ మహర్దశ.. డబ్బులో మునిగి తేలుతారు!

Published: Mar 23, 2025, 05:00 PM IST|Updated: Mar 23, 2025, 05:00 PM IST

Mars Transit In Cancer 2025: కుజుడు అతి త్వరలోనే కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో బోలెడు లాభాలు పొందగలుగుతారు.

Mars Transit In Cancer 2025: కుజ గ్రహానికి జ్యోతిష్య శాస్త్రం పరంగా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే కుజుడిని దేవతలకు సైన్యాధిపతిగా పరిగణిస్తారు. అందుకే కుజ గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేసినప్పుడు అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతూ ఉంటుంది. అయితే ఈ గ్రహం అక్టోబర్ 2024 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి ప్రవేశించింది. ఆ తర్వాత జనవరి 25న మిధున రాశిలోకి ప్రవేశించింది. మళ్లీ ఏప్రిల్ మూడో తేదీ 2025 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. 
 

Mars Transit 20251/7

కుజుడు కర్కాటక రాశిలోకి

కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల మొత్తం ఆరు రాశులపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు కన్యారాశి తో పాటు మరికొన్ని రాశుల వారికి ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికపరమైన సమస్యలు తీరిపోతాయి.  

Astrology 20252/7

కన్య రాశి 

కుజ గ్రహ సంచారం కారణంగా ముఖ్యంగా కన్యారాశి వారిపై ప్రత్యేకమైన ఎఫెక్ట్ పడుతుంది. దీనికి కారణంగా వీరికి శుభ సమయం ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. అలాగే వీరికి స్నేహితుల నుంచి పూర్తి సపోర్టు కూడా లభిస్తుంది. దీనివల్ల వీరు అద్భుతమైన సంపాదనను పొందుతారు. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.   

Mars Transit Effect3/7

కన్య రాశి

కన్య రాశి వారికి భాగస్వామ్య జీవితం కూడా ఈ సమయంలో చాలా బాగుంటుంది. భాగస్వామి నుంచి ప్రేమను పొందడమే.. కాకుండా గౌరవాన్ని కూడా పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. అలాగే విద్యార్థులు పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. 

Mars Transit 2025 Effects4/7

మేషరాశి 

మేష రాశి వారికి కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏప్రిల్ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో ఆనందం రెట్టింపబడమే కాకుండా.. ఆర్థికపరమైన పరిస్థితులు కూడా కాస్త మెరుగుపడతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.   

Saturn Transit 20255/7

మేష రాశి

మేష రాశి వారికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. అలాగే ఆదాయ వనరులు పెరిగి సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. దీనికి కారణంగా వీరు ఆస్తులు కొనుగోలు చేయడమే కాకుండా.. కొత్త కార్లు భవనాలు కొనుగోలు చేస్తారు. మేష రాశి వారి ప్రవర్తన కూడా ఈ సమయంలో మారుతుంది.

Mars Transit In Cancer 20256/7

తుల రాశి

కుజుడు రాశి మార్పులు కారణంగా తులా రాశి వారికి వ్యాపారాల పరంగా కూడా చాలా వరకు పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా ప్రతి పనిలో విజయాలు సాధించగలుగుతారు. అలాగే మానసిక ఆనందం కూడా రెట్టింపు పై ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. అంతేకాకుండా వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా ముందుకు వెళుతుంది. 

Mars Transit In Cancer7/7

తులారాశి 

తులా రాశి వారికి కూడా భార్యాభర్తల మధ్య వస్తున్న విభేదాలు పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా వీరికి భాగస్వామి సపోర్టు లభించి వ్యాపారాలపరంగా కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో డబ్బు పరంగా కాస్త జాగ్రత్తగా ఉండడం మేలు. అలాగే ఆరోగ్యంపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.