Add Zee Business As A Preferred Source
App

Mass Jathara First Review:‘మాస్ జాతర’ ఫస్ట్ రివ్యూ.. రవితేజ హిట్ కొట్టినట్టేనా..!

Written ByTA Kiran Kumar
Published: Oct 30, 2025, 06:35 AM IST|Updated: Oct 30, 2025, 06:35 AM IST

Mass Jathara First Review: తెలుగులో హిట్ ఫ్లాపులకు సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలరించే రవితేజ.. లాస్ట్ ఇయర్ ‘మిస్టర్ బచ్చన్’ తర్వాత కాస్త గ్యాస్ తీసుకొని.. తాజాగా ‘మాస్ జాతర’  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. రవితేజ ఈ సినిమాతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడా అనేది ఫస్ట్ రివ్యూలో చూద్దాం.. 

Mass Jathara First Review1/5

మాస్ జాతర ఫస్ట్ రివ్యూ

Mass Jathara First Review: రవితేజ.. తెలుగులో ప్రస్తుత జనరేషన్ లో ఎక్కువ మంది దర్శకులను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత రవితేజకు దక్కుతుంది. ఇప్పటికే బోయపాటి శ్రీను, హరీష్ శంకర్ సహా ఎంతో మంది దర్శకులను పరిచయం చేశారు. తాజాగా ఇపుడు మాస్ రాజా.. ‘మాస్ జాతర’ సినిమాతో భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. 

Mass Jathara Censor Talk 2/5

మాస్ జాతర సెన్సార్ టాక్

తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మాస్ జాతర’ సినిమా క్రాక్ + విక్రమార్కుడు తరహాలో సరికొత్తగా ఉందని చెబుతున్నారు. మాస్ ఆడియన్స్ కోరుకునే యాక్షన్ ప్లస్ కామెడీ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం పక్కా అని చెబుతున్నారు. 

Dhamaka Combination 3/5

ధమాకా కాంబినేషన్

మరోవైపు ‘ధమాకా’ వంటి సక్సెస్ తర్వాత సరైన సక్సెస్ లేని రవితేజ ఈ సినిమాలో మరోసారి శ్రీలీలతో కలిసి నటించారు. అది ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అంతేకాదు ‘మాస్ జాతర’ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. 

Ravi Teja 4/5

రవితేజ

మరోవైపు ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. గతంలో విక్రమార్కుడు, క్రాక్ వంటి చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటనకు మంచి మార్కులే పడ్డాయి. మధ్యలో పోలీస్ గా చేసిన ‘టచ్ చేసి చూడు’ చిత్రాలు నిరాశ పరిచినా.. తాజాగా ‘మాస్ జాతర’లో రైల్వే పోలీస్ గా సరికొత్తగా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. 

Police Charecter 5/5

పోలీస్ క్యారెక్టర్

ఈ నెల 31న ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ వేస్తున్నారు. కొత్త దర్శకుడు .. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం.. కొత్త దర్శకుడు..కలిసి వచ్చిన పోలీస్ క్యారెక్టర్.. ఇలా అన్ని కలిసి రవితేజ.. మాస్ జాతర సినిమాతో నిజంగా మాస్ జనాన్ని థియేటర్స్ కు రప్పించి ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.