Add Zee Business As A Preferred Source
App

Massive Protest: మాజీ సీఎం కేసీఆర్‌పై సీబీఐ విచారణ భగ్గుమన్న తెలంగాణ.. ఆందోళనలు తీవ్రం

Published: Sep 01, 2025, 08:46 PM IST|Updated: Sep 01, 2025, 08:46 PM IST

Massive Protest Against Kaleshwaram CBI Probe: కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించిన సీపీ ఘోష్‌ నివేదికపై సీబీఐ విచారణకు ఆదేశించడంపై తెలంగాణలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కేసీఆర్‌, హరీశ్‌ రావుపై కక్షపూరిత చర్యలపై యావత్‌ తెలంగాణ భగ్గుమంది. తెలంగాణవ్యాప్తంగా జరిగిన ఆందోళన దృశ్యాలు ఇలా ఉన్నాయి.

1/12

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీబీఐ విచారణకు ఆదేశించడంపై యావత్‌ తెలంగాణ భగ్గుమంది. పోరాడి తెలంగాణ తీసుకువచ్చిన యోధుడిపై దురుద్దేశం, కుట్రపూరితంగా విచారణకు ఆదేశించడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో తప్పుబట్టాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

2/12

సీబీఐ విచారణపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్ వద్ద కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ తల్లికి జలాభిషేకం చేసిన జగిత్యాల నియోజకవర్గం, కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు

3/12

భువనగిరిలో ఉన్న బస్వాపూర్ వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో నీళ్లు అందించిన కేసీఆర్‌పై అడ్డగోలు ఆరోపణలు చేయడంపై నిరసనగా కాళేశ్వరం జలాలతో తెలంగాణ తల్లికి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు జలాభిషేకం చేశారు. రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగడి సునీత మహేందర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. తుంగబాలు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

4/12

తిమ్మాపూర్‌లో జస్టిస్‌ పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన కాళేశ్వరం రిపోర్ట్‌ను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌  దహనం చేశారు. 'కాళేశ్వరం కూలిందని చెబితే ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎట్లా వచ్చాయి' అని ప్ఱశ్నించారు. ఆరు గ్యారెంటీలు ఇవ్వకపోగా అబద్ధ ప్రచారంతో బీఆర్ఎస్‌ పార్టీపై బురదచల్లే రాజకీయాలు రేవంత్‌ రెడ్డి మానుకోవాలని రసమయి హితవు పలికారు.

5/12

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, కాళేశ్వరంపై విష ప్రచారం చేసి ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్‌ రెడ్డి కుట్ర చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మండిపడ్డారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.

6/12

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నల్లజెండాలతో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం విజయవాడ రహదారిపై ఆందోళన చేపట్టగా పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

7/12

కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చిత్రపటానికి  సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద గోదావరి జలాలతో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు  జలాభిషేకం చేశారు.

8/12

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై, కాళేశ్వరంపై రేవంత్‌ రెడ్డి చేస్తున్న కుట్రలపై మెదక్‌లో బీఆర్ఎస్ పార్టీ భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై అక్రమ కేసులు మోపుతున్నారని ఆందోళన చేపట్టగా పోలీసులు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవందర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారు.

9/12

మెదక్ నియోజకవర్గంలో చిన్నశంకరంపేటలో తెలంగాణ అమరవీరుల స్థూపానికి కాళేశ్వరం జలాలతో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జలాభిషేకం చేశారు.

10/12

కేసీఆర్‌పై కుట్ర చేసి.. కాళేశ్వరాన్ని నిర్విర్యం చేసి.. గోదావరి జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ చేస్తున్న కుట్రలకు నిరసనగా పెద్దపల్లిలో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. తెలంగాణ తల్లి విగ్రహానికి కాళేశ్వరం జలాలతో జలాభిషేకం చేశారు.

11/12

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మిడ్ మానేరు జలాశయం వద్ద కాళేశ్వరం జలాలతో తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు జలాభిషేకం చేశారు. 

12/12

నల్లగొండ జిల్లా దేవరకొండలో పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై నిరసనగా కొండమల్లేపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు.