Banks Closed: తెలుగు రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలెర్ట్‌.. బ్యాంకులు 12 రోజులు బంద్‌..!

May Month Banks Holidays List 2025: మే నెల అతి దగ్గరలో ఉంది. అయితే, వచ్చే నెల మే లో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేస్తాయి తెలుసా? ఈ నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు రానున్నాయి. ప్రతి రెండో, నాలుగో శనివారాలతోపాటు ఆదివారం కూడా బ్యాంకులు బంద్‌ ఉంటాయి.
 

1 /5

సాధారణంగా బ్యాంకులు ఆర్‌బీఐ నిర్ధేశించిన జాబితా ప్రకారం సెలవులు మంజూరు చేస్తారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు వర్తిస్తుంది. ఇవి కాకుండా కొన్ని స్థానిక పండుగల ఆధారంగా కూడా సెలవులు ఇస్తారు. ఇదిలా ఉండగా మే నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు బంద్‌ ఉంటాయి తెలుసుకుందాం.  

2 /5

ఈ ఏప్రిల్‌ నెలలో నాలుగో శనివారం కూడా ఉంది. 26న రానుంది. ఇక 27వ తేదీ ఆదివారం  కాబట్టి ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్‌ ఉంటాయి. ఇక మే నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు బంద్‌ ఉంటాయి తెలుసుకుందాం.  

3 /5

మే 1న మే డే సందర్భంగా ఆరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్‌ ఉండనున్నాయి. మే 4వ తేదీ ఆదివారం కాబట్టి ఆరోజు ఎలాగూ సెలవు.ఇక మే 9వ తేదీ శుక్రవారం రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతి సందర్భంగా కోల్‌కత్తాలో బ్యాంకులు బంద్‌ ఉంటాయి. ఆ మరుసటి రజు మే 10వ తేదీ రెండో శనివారం బ్యాంకులకు సెలవు ఉండనుంది.మే 11వ తేదీ ఆదివారం.  

4 /5

మే 12వ తేదీ బుద్ధ పూర్ణిమ భోపాల్‌, జమ్మూ, కోల్‌కత్తా, లక్కో, ముంబై తదితర ప్రాంతాల్లో బ్యాంకులు బంద్‌ ఉంటాయి. మే 16 స్టేట్‌  గ్యాంగ్‌ టాక్‌లో బ్యాంకులు బంద్‌. మే 18వ తేదీ ఆదివారం బ్యాంకులు బంద్‌ ఉంటాయి. ఇది కాకుండా మే 24 ఆదివారం కాబట్టి ఆరోజు బ్యాంకులు బంద్‌.  

5 /5

మే 29వ తేదీ మహారాణా ప్రతాప్‌ జయంతి సందర్భంగా ఆరోజు సమ్లాలో బ్యాంకులు బంద్‌ ఉంటాయి. అయితే, బ్యాంకులు బంద్‌ ఉన్నా కానీ, ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.  ఈ నేపథ్యంలో ముందుగానే బ్యాంకులు ఎన్ని రోజులు బంద్‌ ఉంటాయి తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడతారు.