Add Zee Business As A Preferred Source
App

Meenakshi Chaudhary: స్టార్ హీరో సినిమా వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను.. డిప్రెషన్ కి వెళ్ళా.. : మీనాక్షి చౌదరి

Written ByVishnupriya
Published: Aug 07, 2025, 09:11 PM IST|Updated: Aug 07, 2025, 09:11 PM IST

Meenakshi choudhary interview 
లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. ప్రస్తుతం వరుస సినిమాలతో తెలుగులోపాటు తమిళంలో కూడా దూసుకుపోతోంది. అయితే ఈ హీరోయిన్ తాజాగా విజయ్ సినిమా గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి..

Meenakshi Chaudhary controversy 1/5

మీనాక్షి చౌదరి,

ఇచ్చుట వాహనములు నిలపరాదు, ఖిలాడి.. సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మీనాక్షి చౌదరి. అయితే మొదట సినిమాలు ఏవి కూడా ఈమెకు పెద్ద విజయాలు సాధించి పెట్టలేదు.

Meenakshi Chaudhary Goat 2/5

తమిళ సినిమా

ఇక ఆ తరువాత తన అదృష్టాన్ని తమిళ సినిమాల ద్వారా పరీక్షించుకుంది. ఇక అక్కడ ఏకంగా విజయ్తో గోట్ లాంటి సినిమా ఆఫర్ సొంతం చేస్తుంది.

Meenakshi Chaudhary about Vijay Movie 3/5

టాలీవుడ్ హీరోయిన్,

అయితే ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. అంతేకాకుండా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి క్యారెక్టర్ పై విమర్శలు కూడా వచ్చాయి. ఇదే విషయాన్ని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది ఈ హీరోయిన్. 

Meenakshi Chaudhary Career Struggles 4/5

విజయ్ సినిమా గోట్,

విజయ్ సినిమా గోట్ చేసి తనచి తప్పు చేశాను అని.. ఆ సినిమా వల్ల చాలా విమర్శలు రావడం వల్ల ఏకంగా డిప్రెషన్ కి వెళ్లాను అని.. అయితే ఆ తర్వాత లక్కీ భాస్కర్ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డాను అని చెప్పుకొచ్చింది. 

Meenakshi Chaudhary Movies 5/5

మీనాక్షి చౌదరి,

అంతేకాదు లక్కీ భాస్కర్ సినిమా చేసిన తర్వాత తనకు మంచి సినిమాల పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి అన్న విషయం కూడా అర్థమైంది తెలిపింది.