Add Zee Business As A Preferred Source
App

Abhishek Sharma: అభిషేక్ శర్మ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా..? కావ్య మారన్ కాదండోయ్..!

Published: Sep 22, 2025, 01:25 PM IST|Updated: Sep 22, 2025, 01:25 PM IST

 Abhishek Sharma Girlfriend: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేర్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్ 2025లో మెరుపు ఆరంభాలు ఇస్తూ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆదివారం పాకిస్థాన్‌పై 39 బంతుల్లోనే 74 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్మాచ్‌గా ఎంపికయ్యాడు. మైదానంలో పాక్ బౌలర్లు కవ్వించగా.. మాటలతో గట్టిగా సమాధానం ఇస్తూ.. బ్యాట్‌తో చుక్కలు చూపించాడు. పాక్‌ను చిత్తుచేయడంలో కీ రోల్ ప్లే చేసిన అభిషేక్ శర్మ వ్యక్తిగత విషయాలు గురించి నెటిజన్లు ఆసక్తిగా వెతుకుతున్నారు. ఇక్కడ అభిషేక్ శర్మ గర్ల్ ఫ్రెండ్ గురించి తెలుసుకుందాం..

Abhishek Sharma Girlfriend1/7

అభిషేక్ శర్మ

అభిషేక్ శర్మ గర్ల్ ఫ్రెండ్ లైలా ఫైసల్ అని ప్రచారం జరుగుతోంది. లండన్‌లో చదువుకున్న ఆమె.. సొంతంగా లైలా రూహి ఫైసల్ డిజైన్స్‌ను స్థాపించింది. అభిషేక్ శర్మతో కలిసి బయట కనిపించడంతో రూమర్స్‌కు బలం చేకూరుతోంది.  

Abhishek Sharma2/7

అభిషేక్ శర్మ బ్యాటింగ్

లైలా ఫైసల్ లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌లో మనస్తత్వశాస్త్రం చదివారు. ఆ తరువాత లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో ఫ్యాషన్ డిజైన్, స్టైలింగ్‌లో స్పెషలైజేషన్ చేశారు. 2022లో లైలా రూహి ఫైసల్ డిజైన్స్‌ను ప్రారంభించి.. భారతీయ వస్త్రాలను ఆధునిక సిల్హౌట్‌లతో ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించే విధంగా డిజైన్ చేస్తున్నారు.  

Who is Abhishek Sharma girlfriend3/7

అభిషేక్ శర్మ గర్ల్ ఫ్రెండ్

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 135 పరుగులు చేసిన సమయంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో గర్వంగా ఉందంటూ పోస్ట్ చేయడంతో రూమర్స్ మొదలయ్యాయి.   

Laila Faisal4/7

అభిషేక్ శర్మ నెట్ వర్త్

లైలాకు సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ ఉంది. ఆమెకు 32.8K కంటే ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌లలో అభిషేక్‌ను ఎంకరేజ్ చేసేందుకు లైలా స్టేడియంకు వస్తుంటారు. అభిషేక్ సోదరి కోమల్‌తో లైలాకు మంచి స్నేహం ఉంది.  

Abhishek Sharma Dating news5/7

ఆసియా కప్ 2025

ఢిల్లీలోని ప్రముఖ కాశ్మీరీ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన లైలా.. అభిషేక్ శర్మతో డేటింగ్ రూమర్లు తరువాత తన ప్రొఫైల్ ను ఆమె ప్రైవేట్ గా మార్చుకుంది.  దీంతో ఆన్‌లైన్ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. లైలా ఫైసల్‌తో అభిషేక్ ప్రేమాయణంపై  క్లారిటీ రావాల్సి ఉంది.   

Abhishek Sharma rumoured girlfriend6/7

అభిషేక్ శర్మ రికార్డులు

కాగా.. ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ శర్మ.. టీమ్ ఓనర్ కావ్య మారన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే అవన్నీ కేవలం పుకార్లేనని తేలిపోయింది.   

Abhishek Sharma Kavya Maran7/7

అభిషేక్ శర్మ Vs పాకిస్థాన్

ఆసియా కప్ లో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో అభిషేక్ శర్మ 173 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. 208 స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అభిషేక్ ఇదే దూకుడు కొనసాగిస్తే.. టీమిండియా ట్రోఫీని గెలవడం ఖాయం.