Add Zee Business As A Preferred Source
App

Niharika Konidela: ‘నీతో సినిమా తీస్తే టీ డబ్బులు రావు’.. స్టార్ హీరో గురించి మెగా డాటర్

Written ByVishnupriyaUpdated byVishnupriya
Published: Sep 02, 2025, 11:15 AM IST|Updated: Sep 02, 2025, 11:17 AM IST

Niharika Shocking Comments : మెగా ఫ్యామిలీ నుంచి హీరోలే కాదు.. హీరోయిన్స్ కూడా ఉన్నారు. లావణ్య త్రిపాఠి స్టార్ హీరోయిన్గా ఉంది ఆ తర్వాత మెగా కోడలు అయిన సంగతి తెలిసిందే. ఇక మెగా కూతురు నిహారిక మొదటిలో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం నిర్మాతగా ప్రయాణం కొనసాగిస్తోంది..

Niharika Konidela Shocking Comments 1/5

ఒక మనసు చిత్రంతో సినిమాలో హీరోయిన్ గా అడుగుపెట్టిన నిహారిక.. పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో కొద్ది సినిమాలు చేసిన తర్వాత.. నిర్మాతగా మారింది.   

Niharika Konidela Comments On Star Hero2/5

హీరోయిన్ గా ఫ్లాప్ అయిన నిహారిక నిర్మాతగా మాత్రం సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా ఈ మెగా డాటర్ తీసిన కమిటీ కుర్రాళ్ళు చిత్రం మంచి విజయం సాధించింది. అయితే నిహారిక ఈమధ్య స్టార్ నటుడు గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.  

Sudigali Sudeer Shocking Incident 3/5

ఎన్నో టీవీ షోల ద్వారా తెగ పాపులర్ అయినా నటుడు సుధీర్.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేశారు.  ఇక ఈ మధ్య సరిగమప లిటిల్స్ ఛాంప్స్ కు యాంకర్ గా వహించగా ఈ షో కి నిహారిక కొణిదెల.. హాజరైన సందర్భంగా సుడిగాలి సుధీర్ ఆమెను సినిమా ఆఫర్ అడిగారు. మీరు కమిటీ కుర్రాళ్లు అనే సూపర్ హిట్ చిత్రం తీశారు.. నాతో కూడా అలా..ఏదైనా కమిటీ అనే సినిమాను తీయొచ్చు కదా అని సుడిగాలి సుధీర్ అడిగారు.

Niharika About Sudheer4/5

దానికి వెంటనే నిహారిక ఆన్సర్ ఇస్తూ.. నీతో కమిటీలు లాంటి సినిమాలు తీస్తే నాకు టీ డబ్బులు కూడా రావని అనేసింది. అయితే ఏదైనా ఫ్యామిలీ డ్రామాను తీయొచ్చు కదా అని అడిగాడు. 

Niharika Movies5/5

ఇక దానికి నిహారిక సమాధానం ఇస్తూ..ఇదంతా కాదు నీతో ఒక సీన్ తీస్తాను.. నువ్వు అలా నడుచుకుంటూ వస్తుంటే మొదట నీ కాళ్లు చూపిస్తాం, ఆ తర్వాత మోకాళ్లు.. అలా చూపిస్తూ వెళ్లి.. తల చూపించే లోపు తల తెగిపోద్ది  అంటూ జోక్ వేసింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ప్రోమో మొత్తం కూడా వైరల్ అవుతుంది.