Add Zee Business As A Preferred Source
App

Mega Daughter: మొదటి భర్తతో విడాకుల కారణం బయటపెట్టిన మెగా డాటర్..

Written ByVishnupriya
Published: Mar 07, 2025, 06:12 PM IST|Updated: Mar 07, 2025, 06:12 PM IST

Mega Daughter Divorce reason

మెగా ఫ్యామిలీలో హీరోల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్క హీరో తమ ప్రతిభను రుజువు చేసుకున్న వాళ్లే. కానీ ఆ ఫ్యామిలీ కూతుర్ల విషయం మాత్రం …కొన్ని వడి దుడుకులు చూడక తప్పలేదు. శ్రీజ, నిహారిక ఇద్దరు కూడా తమ మద్దతు భర్తలతో విడాకులు తీసుకున్నవారే.. ఇందుకు కల కారణాల గురించి ఎన్నో వార్తలు ప్రచారం అంటూ వచ్చాయి…

Niharika Divorce Reason 1/5

నిహారిక కొణిదెల పెళ్లి

మెగా ఫ్యామిలీలో శ్రీజ, నిహారిక ఇద్దరు కూడా తమ మొదటి భర్తలతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సాధారణ కుటుంబాలలో జరిగితే ఇది పెద్ద విషయం కాకపోయినా.. మెగా ఫ్యామిలీలో జరగడంటూ.. ఇందుకు గల కారణాలు ఏమిటి అని అందరూ చర్చించసాగారు. 

Niharika Divorce 2/5

నిహారిక కొణిదెల డివోర్స్

ముఖ్యంగా కరోనా టైంలో నిహారిక పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. అయితే పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే.. తన భర్త, టెకీ చైతన్య నుంచి విడాకులు తీసుకుంది. కొన్ని విభేదాల వల్లనే ఈ జంట విడిపోయింది అని వార్తలు వచ్చాయి. 

Niharika Personal Life3/5

నిహారిక కొణిదెల విడాకుల కారణం

ఇక విడాకుల తరువాత నిహారిక తన కెరీర్‌పై దృష్టి సారించింది. కొన్ని వెబ్ సిరీస్ లో నటించడమే కాకుండా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించి. 

 

Niharika Interview 4/5

నిహారిక కొణిదెల ఇంటర్వ్యూ

ఇక తాజాగా తను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విడాకుల గురించి స్పందించింది నిహారిక. విడాకులు అనేది ఎవరికైనా బాధాకరమైన విషయం అని.. సెలబ్రిటీ హోదా తో దానికి సంబంధం ఉండదని.. ఎవరికైనా అది ఒక బాధాకరమైన అనుభవం అని నిహారిక‌ చెప్పుకొచ్చింది. ``విడాకుల గురించి ఆలోచిస్తూ ఎవరూ పెళ్లి అని రిలేషన్ షిప్ లోకి ప్రవేశించరు. అయితే కొన్నిసార్లు ప‌రిణామాలు వేరుగా ఉంటాయి. కొన్ని విషయాలు మన చేతుల నుంచి అదుపు తప్పుతాయి. అలాంటప్పుడు తప్పకుండా కష్టమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది`` అని తెలిపింది.

Mega Daughter Niharika5/5

మెగా డాటర్ నిహారిక

జీవితంలో మనం ఎదుర్కొనే పరిణామాల వల్ల ఎన్నో నేర్చుకుంటామో అని చెప్పుకొచ్చింది. కాగా తాజాగా హారిక నిర్మాతగా వ్యవహరించిన `కమిటీ కుర్రోళ్ళు` సినిమా ఆమెకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం నేను `వాట్ ది ఫిష్`లో గ్లామరస్ పాత్రతో మెరువనుంది.