Add Zee Business As A Preferred Source
App

Job fair: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. హైదరాబాద్‌లో 22వ తేదీ బిగ్‌ జాబ్‌ ఫెయిర్‌..!

Written ByRenuka Godugu
Published: Sep 19, 2025, 12:03 PM IST|Updated: Sep 19, 2025, 12:03 PM IST

Job fair In Hyderabad: నిరుద్యుగులకు భారీ శుభవార్త. ఈ 22వ తేదీ హైదరాబాద్‌లోని శాలిబండాలో బిగ్‌ జాబ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నారు. లియోనైన్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌, గెలక్సీ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ కలిసి సోమవారం జాబ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నారు.
 

Mega Job Fair1/5

మెగా జాబ్‌ ఫెయిర్‌

హైదరాబాద్‌లో మెగా జాబ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు ఇది బంపర్‌ ఛాన్స్‌. సోమవారం 22వ తేదీ శాలిబండాలో జాబ్‌ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. లియోనైన్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌, గెలక్సీ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ కలిసి ఈ ఫెయిర్‌ నిర్వహిస్తున్నారు.  

Hyderabad2/5

హైదరాబాద్‌

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌లోని శాలిబండా ఎక్స్‌ రోడ్స్‌లో ఈ జాబ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఫెయిర్‌లో నిరుద్యోగులు జాబ్‌ పొందవచ్చు.  

Software3/5

సాఫ్ట్‌వేర్‌

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, బీపీఓ/ఐటీఈఎస్‌, ఇన్‌ఫర్మెషన్‌ టెక్నాలజీ, ఇన్సూరెన్స్‌, రీటైల్‌, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, టీచింగ్‌, పారామెడికల్‌ సైన్స్‌, గిగ్‌ ఎకానమీ జాబ్ ఓపెనింగ్స్‌ జరగనున్నాయి.  

Interview4/5

ఇంటర్వ్యూ

ఈ జాబ్‌ ఓపెనింగ్‌ ఇంటర్వ్యూకు పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ చేసినవారు అర్హులు. అభ్యర్థులు తమతోపాటు ఓ 15 అప్డేట్‌ రెజ్యూమ్‌  కాపీ ఫార్మల్‌ డ్రెస్సింగ్‌లో రావాలని సూచించారు. సెల్ప్‌ ఇంట్రడక్షన్‌, ఎడ్యుకేషనల్‌ సర్టిఫికేట్‌, ఐడీ ప్రూఫ్స్‌, ఫోటోగ్రాఫ్‌ కూడా తీసుకురావాలి.  

Job Opportunities5/5

ఉద్యోగ అవకాశాలు..

ఉద్యోగ అవకాశాలు.. ఐటీ సాఫ్ట్‌వేర్‌, బీపీఓ, కస్టమర్ సపోర్ట్‌ (వాయిస్‌, నాన్‌ వాయిస్‌), టెక్నికల్‌ సపోర్ట్‌, బ్యాక్‌ ఆఫీస్‌ అసోసియేట్స్‌,గిగ్‌ ఇతర కంపెనీల్లో జాబ్స్‌ పొందవచ్చు.