Add Zee Business As A Preferred Source
App

Chiranjeevi: చరణ్ బాబు ఓ తండ్రిగా నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నా.. చిరంజీవి స్పెషల్ పోస్ట్ వైరల్..!

Written ByAruna Maharaju
Published: Sep 28, 2025, 07:06 PM IST|Updated: Sep 28, 2025, 07:06 PM IST

Megastar Chiranjeevi Emotional Post: గ్లోబర్ స్టార్ రామ్ చరణ్.. తన నటనతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. రామ్ చరణ్ సినీ పరిశ్రమలోకి వచ్చి 18 ఏళ్లు కంప్లీట్ అవ్వడంతో.. మెగా ఫ్యాన్స్ కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్‌పై చేసిన స్పెషల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

 Global Star Ram Charan1/5

రామ్ చరణ్

రామ్ చరణ్.. ఈ పేరు గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరమే లేదు. తన నటనతో గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే రామ్ చరణ్ సినీ పరిశ్రమలోకి వచ్చి నేటికి 18 ఏళ్లు పూర్తయ్యాయి. మెగాస్టార్ కొడుకుగా మొదటి సినిమా చిరుతతో 2007 సెప్టెంబర్ 28న.. రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 Global Star Ram Charan2/5

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్

అప్పుడు మొదలైన సినీ ప్రస్థానం మెగా పవర్ స్టార్‌గా ఎదిగి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మారి ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు రామ్‌ చరణ్. తన నటన, డ్యాన్స్‌తో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

Ram Charan3/5

మెగాస్టార్ చిరంజీవి

రామ్ చరణ్ సినీ పరిశ్రమలోకి వచ్చి 18 ఏళ్లు కంప్లీట్ అవ్వడంతో.. మెగా ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్‌పై స్పెషల్ ట్వీట్ పోస్ట్ చేసారు.

Megastar Chiranjeevi4/5

రామ్ చరణ్ పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

చిరంజీవి తన ట్వీట్‌‌లో.. చరణ్ బాబు, 18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.

 

Megastar Chiranjeevi Emotional Post On Ram Charan5/5

చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ..విజయోస్తు… అని రాసుకొచ్చారు. దీంతో తనయుడిపై చిరంజీవి గర్వంతో రాసిన ఈ మాటలను మెగా ఫ్యాన్స్ నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.