Mercury And Mars Conjunction Effect On Zodiac: విజయదశమి రోజే తులా రాశిలో బుధ, కుజ గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. అలాగే ఉద్యోగాలు చేసే వారికి కూడా ఈ సమయం చాలా అద్భుతంగా మారుతుంది.
Mercury And Mars Conjunction Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ రెండో తేదీన విజయదశమి వచ్చింది. హిందూ పురాణాల ప్రకారం విజయదశమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. చెడుపై మంచి గెలిచిన సందర్భంగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఇదే రోజు కొన్ని గ్రహాలకు కదలికలు కూడా జరుగుతాయి దీని కారణంగా ఈరోజు మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ తేదీన బుధ గ్రహం సంచారం చేయబోతోంది.
1/5అక్టోబర్ రెండవ తేదీ రాత్రి బుధుడు తులా రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఇప్పటికే ఈ రాశిలో కుజ గ్రహం సంచార దశలో ఉంది. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సంయోగం కారణంగా మొత్తం 12 రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని వారు అంటున్నారు. అయితే పండగ పూట అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం..
2/5మకర రాశి వారికి కుజుడు బుధుడి సంయోగం కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఉద్యోగాలపరంగా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారు భారీ మొత్తంలో ఆర్డర్లు పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన వ్యక్తులు ఉన్నత పదవులు పొందుతారు. అలాగే వ్యక్తిగత జీవితం కూడా ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది.
3/5మేష రాశి వారికి కుజుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి ఈ రెండు గ్రహాల కలయిక జరగడం కారణంగా మేషరాశి వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా సంపాదన కూడా ఊహించని స్థాయిలో పెరిగి.. ఆస్తులపరంగా కలిసి వస్తుంది. అలాగే ఈ సమయంలో వీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్ కు సంబంధించిన జీవితం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
4/5కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా బుధుడి సంచార ప్రభావం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే వ్యాపారాలు లాభసాటిగా మారడమే కాకుండా ఆర్థికంగా చాలా వరకు కలిసి వస్తుంది. ఆస్తుల నుంచి ఈ సమయంలో భారీ మొత్తంలో లాభాలు కూడా పొందుతారు.
5/5తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు పూజ బుధుడి సంయోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వ్యక్తిగత జీవితంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఆర్థికంగా కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.