Add Zee Business As A Preferred Source
App

Hyderabad Metro: గణేష్ నిమజ్జనం వేళ ప్రయాణికులకు భారీ శుభవార్త.. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు.. డిటెయిల్స్.!.

Written ByInamdar Paresh
Published: Sep 05, 2025, 03:20 PM IST|Updated: Sep 05, 2025, 03:30 PM IST

Ganesh Immersion In hyderabad: గణేష్ నిమజ్జనం వేళ హైదరాబాద్ ప్రయాణికులకు మెట్రో రైల్ భారీ శుభవార్త చెప్పింది. ఈ  క్రమంలో నిమజ్జనం రోజున శనివారం రోజున ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేకంగా రైళ్లు నడ్పిస్తున్నట్లు చెప్పారు.

Ganesh immersion:1/6

హైదరాబాద్ గణేష్ నిమజ్జనం వేడుక:

దేశవ్యాప్తంగా గణపయ్య నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భక్తిభావనలతో, భజనలతో నిమజ్జనాల్ని నిర్వహిస్తున్నారు. అయితే.. నిమజ్జనం వేళ హైదరాబాద్ లో మెట్రో ప్రయాణికులకు మెట్రో అధికారులు భారీ శుభవార్త చెప్పారు.

Hyderabad:2/6

హైదరాబాద్ గణపయ్య నిమజ్జనం:

హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ లో జరిగే గణపయ్య నిమజ్జనాల్ని చూసేందుకు స్థానికులు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తారు. అంతే కాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ట్యాంక్ బండ్ వద్ద ఉండి నిమజ్జనాల్ని చూస్తారు.   

ganesh visarjan:3/6

వినాయక నిమజ్జనం:

మరోవైపు నిమజ్జనం వేళ ప్రత్యేకంగా పోలీసుల్ని బందో బస్తుకు మోహరించారు. ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్యల తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ లను కూడా భారీగా మళ్లించారు. ఈ క్రమంలో రోడ్లపై గణపయ్య విగ్రహాల నిమజ్జనంతో పలు చోట్లరోడ్లన్ని కూడా బిజీగా ఉంటాయి.  ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా నిమజ్జనంకు బస్సుల్ని ఏర్పాటు చేశారు.   

Hyderabad metro:4/6

హైదరాబాద్ మెట్రో స్టేషన్:

దీనికి తోడు మెట్రో రైలు అధికారులు ప్రజలకు భారీ శుభవార్త చెప్పారు. వినాయక నిమజ్జనం జరిగే శనివారం రోజున ఉదయం నుంచి రాత్రి వరకు అంటే.. తెల్లవారు జామున 6 గంటల నుంచి అర్దరాత్రి 1 గంటల వరకు ప్రత్యేకంగా రైళ్లను నడ్పిస్తున్నట్లు చెప్పారు.  

Hyderabad ganesh immersion:5/6

వినాయక నిమజ్జనం:

ప్రయాణికులు రైల్వే సర్వీసుల్ని ఉపయోగించుకోవాలని మెట్రో అధికారులు తెలిపారు. సాధారణంగా రాత్రి 11 గంటలకే సర్వీసులు ముగుస్తాయి. ఆ తర్వాత మరల రైళ్లు ఉండవు. కానీ నిమజ్జనం వేళ మాత్రం రాత్రి వరకు అధికారులు రైళ్ల సర్వీసుల్ని పొడిగించారు.  

Hyderabad ganesh visarjan:6/6

హైదరాబాద్:

కానీ.. ఈ సారి ఉదయం 6 గంటల నుండి రాత్రి 1 గంట వరకు రైళ్లు నడపాలని నిర్ణయించారు. అర్ధరాత్రి తరువాత కూడా అందుబాటులో ఉండే ఈ సౌకర్యం భక్తులకు  గుడ్ న్యూస్ గా చెప్పుకొవచ్చు. ముఖ్యంగా ట్యాంక్‌ బండ్ పరిసర ప్రాంతాలకు గణపయ్య నిమజ్జనాలకు  వెళ్లిన వారు తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు ఈ మార్పు ఎంతో ఉపయోగ పడుతుందని మెట్రో అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.