Add Zee Business As A Preferred Source
App

MiG-21: IAFలో చారిత్రక ఘట్టానికి తెర.. మిగ్-21 ఫైటర్ జెట్ సేవలకు వీడ్కోలు పలికిన వాయుసేన

Written ByAruna Maharaju
Published: Sep 26, 2025, 05:39 PM IST|Updated: Sep 26, 2025, 05:39 PM IST

MiG 21 Fighter Jet Retirement: భారత వాయుసేన (IAF) లో ఓ చారిత్రక శకం ముగిసింది. ఆరు దశాబ్దాల సేవ తర్వాత మిగ్-21 ఫైటర్ జెట్ సేవలకు వాయుసేన వీడ్కోలు పలికింది. చండీగఢ్ వాయుసేన కేంద్రం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. దీనికి రక్షణ మంత్రి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.  మిగ్ -21 ఫైటర్ జెట్‌కు వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ వీడ్కోలు పలికారు.  
 

MiG 21 Fighter Jet Retirement1/5

మిగ్-21

భారత వాయుసేనలో ఒక ముఖ్యమైన ఘట్టం ముగిసింది. ఆరు దశాబ్దాలకు పైగా భారత గగనతల రక్షణకు మద్దతుగా నిలిచిన మిగ్-21 యుద్ధ విమానానికి వాయుసేన వీడ్కోలు చెప్పింది. మిగ్-21 మొదటిసారి 1963లో భారత్‌లో అడుగు పెట్టింది. అప్పటి నుంచి 1971 యుద్ధం నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు అనేక యుద్ధాల్లో విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. శుక్రవారం చండీగఢ్ వాయుసేన కేంద్రంలో ఈ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. వాయుసేన అధిపతి విపి సింగ్ ఈ విమానానికి వీడ్కోలు పలికారు.

MiG 21 2/5

మిగ్-21 యుద్ధ విమానం

ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాయుసేన సీనియర్ అధికారులు, మాజీలు హాజరయ్యారు. చివరి ప్రయాణానికి గుర్తుగా విమానాలకు వాటర్ సెల్యూట్ చేశారు. తర్వాత వాటికి సంబంధించిన లాగ్‌బుక్‌ను రాజ్‌నాథ్ సింగ్‌కు ఎయిర్ చీఫ్ అందజేశారు. ప్రత్యేక స్మారక పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు.  

Bye Bye To Mig 21 Jet Fighters3/5

మిగ్-21 యుద్ధ విమానం

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ మిగ్-21 భారత రక్షణలో కీలకమైనదని చెప్పారు. 1971 యుద్ధం, కార్గిల్ యుద్ధం, బాలకోట్ దాడి, ఆపరేషన్ సిందూర్ వంటి ముఖ్యమైన సంఘటనల్లో  నిర్ణయాత్మక పాత్ర పోషించిందన్నారు. మిగ్-21 కేవలం విమానం మాత్రమే కాదు.. భారత్ రష్యా మధ్య లోతైన సంబంధాలకు చిహ్నమని అన్నారు. ఇది శక్తివంతమైనది, భారత్‌కు రక్షణ కవచంగా నిలిచింది. తరతరాల వైమానిక యోధులకు స్ఫూర్తినిచ్చింది.  

Mig 21 Bison Retirement4/5

మిగ్-21 ఫైటర్ జెట్

మిగ్-21ని రష్యా తయారు చేసింది. 1962లో భారత వాయుసేనలోకి వచ్చింది. భారత్‌కు మొదటి సూపర్‌సోనిక్ యుద్ధ విమానం ఇదే. ఆరు దశాబ్దాలుగా వాయుసేనకు వెన్నెముకగా నిలిచింది.   

Mig 21 Fighter Jet Retirement5/5

మిగ్-21 ఫైటర్ జెట్ సేవలకు వీడ్కోలు

వేగం, చురుకుదనంతో మిగ్-21 ప్రసిద్ధి చెందింది. అనేక యుద్ధాలు, ఆపరేషన్లలో క్రియాశీలంగా పనిచేసింది. ఇప్పుడు తేజస్ వంటి ఆధునిక స్వదేశీ విమానాలు వచ్చాయి కాబట్టి మిగ్-21 సేవలకు ముగింపు పలికారు.