EPFO Retired Private Employees Pension Good News: దసరా సందర్భంగా ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈపీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఒక్క ప్రైవేటు ఉద్యోగికి పెన్షన్ పథకాన్ని రూపొందిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒకవేళ కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది పదవి విరమణ పొందిన తర్వాత పదివేలకు పైగా పెన్షన్ లభిస్తుంది..
EPFO Retired Private Employees Pension Good News Telugu: ప్రస్తుతం చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు లాగా పదవి విరమణ పొందిన తర్వాత ప్రైవేటు ఉద్యోగులు ఎంతో కొంత పెన్షన్ పొందాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది వివిధ రకాల బ్యాంకులకు సంబంధించిన పెన్షన్ పథకాల్లో డబ్బులు జమ చేసుకుంటే.. మరి కొంతమంది ప్రత్యేకమైన పెన్షన్ పథకాలలో ఉద్యోగాలు చేసే సమయంలోనే డబ్బులు పెట్టుబడిగా పెడుతున్నారు. అయితే అతి త్వరలోనే ప్రైవేటు ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పెన్షన్ పథకాన్ని తీసుకురాబోతోంది. ఈ పథకంలో భాగంగా పదవి విరమణ పొందిన ప్రతి ప్రైవేటు ఉద్యోగికి పెన్షన్ లభిస్తుంది.
1/7చాలామంది ఎంతో కష్టపడి ప్రైవేటు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. అలాగే స్టేబుల్‌గా ఎన్నో ఏళ్లపాటు సర్వీస్ చేసి పదవి విరమణ పొందుతున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని మోదీ సర్కార్ త్వరలోనే మంచి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. రిటైర్మెంట్ పొందిన ప్రతి ఉద్యోగికి ఎంతో కొంత పెన్షన్ లభించే సదుపాయాన్ని అందించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
2/7ప్రైవేటు ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్క ఈపీఎఫ్ ఖాతాదారునికి కేంద్ర ప్రభుత్వం అందించే ..ప్రత్యేకమైన పెన్షన్ పథకం ద్వారా వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశాలున్నాయి. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కేంద్ర ప్రభుత్వం దసరా ముందే చేసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.
3/7ఈపీఎఫ్ ఖాతాదారులు కనీస వయసుతో రిటైర్మెంట్ పొందిన వారికి ఈ ప్రత్యేకమైన పథకం ద్వారా ప్రతినెల పెన్షన్ లభించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం కలిగిన వారు పదవి విరమణ తర్వాత యూనివర్సిటీ పెన్షన్ సిస్టం లో భాగంగా ఎలాగైతే ప్రతినెల పెన్షన్ పొందుతారో.. అలాగే ప్రైవేటు ఉద్యోగులకు కూడా పెన్షన్ వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పెన్షన్ పథకాన్ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.
4/7యూనివర్సల్ పెన్షన్ సిస్టం తరహా పెన్షన్స్ స్కీమును ప్రైవేటు ఉద్యోగులకు కూడా అందించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో ఎన్నోసార్లు చర్చించినట్లు మనందరికీ తెలిసే.. అయితే అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేకమైన బిల్లును ప్రవేశపెట్టే ఛాన్సులు ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.
5/7అలాగే యూనివర్సల్ పెన్షన్ సిస్టం తరహా కొత్త పెన్షన్ స్కీం అందుబాటులోకి వస్తే ప్రైవేటు ఉద్యోగుల వేతనాలు కూడా కాస్త పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దీనివల్ల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా పెరిగి.. ఈపీఎఫ్ ఖాతాలో భారీ మొత్తంలో డబ్బులు జమ అయ్యే ఛాన్స్ ఉంది..
6/7ఇప్పటికే జీతాలు పెంచే అంశంపై కార్మిక శాఖ ప్రత్యేకమైన ప్రపోజల్లను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది.. వీటిని ఆర్థిక శాఖ ముందు ఉంచితే.. ఆమోదం తెలిపిన వెంటనే ప్రైవేటు ఉద్యోగుల జీతాలు కొంతవరకు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ఈపీఎఫ్ కలిగిన ప్రతి ప్రైవేటు ఉద్యోగి.. పదవి విరమణ తర్వాత భారీ మొత్తంలో పెన్షన్ పొందగలుగుతాడు.
7/7ముఖ్యంగా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే.. బేసిక్ శాలరీ 21 వేల వరకు పెరిగే అవకాశాలున్నాయి. దీని కారణంగా ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా పెరిగి.. పదవి విరమణ తర్వాత ప్రతి ఉద్యోగికి రూ.10,000 పైగా ప్రతినెల పెన్షన్ లభించే అవకాశాలుంటాయి. ఇదే జరిగితే దాదాపు 21 ప్రైవేటు ఉద్యోగులు జాక్పాట్ కొట్టినట్లే..